Jr. Ntr Will Give Surprise To Fans: విజయవాడలో ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది.. ఎన్టీఆర్

Jr. Ntr Will Give Surprise To Fans: విజయవాడలో ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది.. ఎన్టీఆర్
x
NTR
Highlights

Jr. Ntr Will Give Surprise To Fans: ఓ ప్రచార వీడియోతో ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ ముందుకు వచ్చాడు.. మొబైల్ రిటైల్ సంస్థ 'సెలెక్ట్'కు ఎన్టీఆర్ ప్రచారకర్తగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే

Jr. Ntr Will Give Surprise To Fans: ఓ ప్రచార వీడియోతో ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ ముందుకు వచ్చాడు.. మొబైల్ రిటైల్ సంస్థ 'సెలెక్ట్'కు ఎన్టీఆర్ ప్రచారకర్తగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సంస్థకి సంబంధించి ఓ ఒక అనౌన్స్‌మెంట్‌ను ఎన్టీఆర్ చేశారు. . జూలై 17న ఈ కంపెనీకి సంబంధించి విజయవాడలో ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతోందని ఈ యాడ్‌లో ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

" మన విజయవాడలో ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. తెలుసుకోవాలని ఉందా? రిమెంబర్ దిస్ డే.. అంటూ సర్‌ప్రైజ్ ఇచ్చారు ఎన్టీఆర్.. అయితే ఇది సెలెక్ట్ మొబైల్స్‌కు సంబంధించిన యాడ్ కాబట్టి ఎన్టీఆర్ సినిమాలకి ఎలాంటి సంబంధం లేదు. ఆ అద్భుతం సెలెక్ట్ మొబైల్స్‌కు సంబంధించిందే అని మాత్రమే అని అర్ధం అవుతుంది.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వచ్చేసరికి .. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరంభీంగా నటిస్తున్నాడు. ఇప్పటికే అల్లూరిగా చరణ్ లుక్ ని రిలీజ్ చేశాడు రాజమౌళి..

ఇక ఎన్టీఆర్ లుక్ కోసం ఇప్పుడు అభిమానులే కాదు మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తుంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న సర్‌ప్రైజ్ ఉంటుందని అందరు భావించారు. కానీ లాక్ డౌన్ వలన స్పెషల్ వీడియో చేయలేకా రాజమౌళి చేతులెత్తేయడంతో అభిమానులకి నిరాశే మిగిలింది. ఇక ఎన్టీఆర్ వీడియో ఎప్పుడు వస్తుందో చూడాలి మరి! ఇక సినిమాని వచ్చే ఏడాది జనవరి 8 న రిలీజ్ చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories