Jr NTR 30 Movie Update: ఎన్టీఆర్‌కు విలన్‌ గా మంచు మనోజ్?

Jr NTR 30 Movie Update: ఎన్టీఆర్‌కు విలన్‌ గా మంచు మనోజ్?
x
Jr NTR and Manchu Manoj (File Photo)
Highlights

Jr NTR 30 Movie Update: అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Jr NTR 30 Movie Update: అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్, హారిక హాసిని క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాదికి ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది..

ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా మంచు మనోజ్ ని తీసుకునేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాత్రల ఎంపికలో బిజీగా ఉన్న త్రివిక్రమ్ మంచు మనోజ్ ని విలన్ గా తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం...ఇక ఇదే విషయాన్ని ఎన్టీఆర్ దగ్గర ప్రస్తావించగా ఎన్టీఆర్ కూడా ఆసక్తి చూపడంతో మనోజ్‌ను త్రివిక్రమ్ సంప్రదించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా మనోజ్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది.. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడక తప్పదు..

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ మరింత స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడు.ఇందులో ఎన్టీఆర్ తో పాటుగా చరణ్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటిచింది.

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో పాల్గొంటాడు.. ప్రస్తుతం స్క్రిప్ట్ కి తుదమెరుగులు దిద్దుతున్న త్రివిక్రమ్ పాత్రల ఎంపికను ఫైనల్ చేయనున్నాడు. అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబనేషన్లో వస్తున్న రెండో చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి..

ఇక అటు మంచు మనోజ్.. చాలా కాలం తర్వాత మళ్లీ హీరోగా సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి అనే కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ 'అహం బ్రహ్మాస్మి' అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని తన సొంత బ్యానర్ లోనే మనోజ్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories