Lakshmi Pranathi: ఫస్ట్ ట్వీట్ నా లవ్లీ భర్తతో.. నెట్టింట్లోకి ఎన్టీఆర్‌ సతీమణి..

Lakshmi Pranathi: దాదాపు టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల భార్యలు అందరూ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే ఉంటారు.

admin1
Published on: 29 Jan 2022 7:26 PM IST
Jr NTR Wife Lakshmi Pranathi Makes her Social Media Debut
X

Lakshmi Pranathi: ఫస్ట్ ట్వీట్ నా లవ్లీ భర్తతో.. నెట్టింట్లోకి ఎన్టీఆర్‌ సతీమణి..

Lakshmi Pranathi: దాదాపు టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల భార్యలు అందరూ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే ఉంటారు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, రామ్ చరణ్ భార్య ఉపాసన, మహేష్ బాబు భార్య నమ్రత, తదితరులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టుతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. తాజాగా ఈ జాబితాలో చేరిన మరొకరు లక్ష్మీప్రణతి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తాజాగా ట్విట్టర్లో అడుగుపెట్టారు. 2011లో ఎన్టీఆర్ ని పెళ్లి చేసుకుని ఇప్పుడు ఇద్దరు పిల్లలకి తల్లి అయినా లక్ష్మీప్రణతి సోషల్ మీడియా కి ఎప్పుడూ దూరంగానే ఉంటూ వచ్చారు.

కానీ ఇన్నాళ్ళకు ట్విట్టర్లో ఆమె అడుగుపెట్టడం అభిమానులకు సంతోషం కలిగించింది. "మీ అందరితో కలిసి ట్విట్టర్ లో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నా మొదటి ట్వీట్ నా లవ్లీ భర్తతో" అంటూ ఎన్టీఆర్ తో కలిసి ఉన్న ఫోటో ని షేర్ చేసింది లక్ష్మీ ప్రణతి. ఆ తర్వాత ఎన్టీఆర్ మరియు రాజమౌళి కుటుంబంతో ఉన్న ఒక ఫోటో ని షేర్ చేసింది. ఇక చాలా తక్కువ వ్యవధిలోనే ఫాలోవర్ లను అందుకున్న లక్ష్మీప్రణతి "అందరికీ కృతజ్ఞతలు. ఐదువేల ఫాలోవర్లు కంప్లీట్ అయ్యాను. ఇంకా రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని అనుకుంటున్నాను. ఇదంతా నీ పవర్" అంటూ ఎన్టీఆర్ ను ట్యాగ్ చేసింది ప్రణతి.


admin1

admin1

Next Story