Jr NTR: వారు లేకుంటే నేను లేను.. తలవంచి పాదాభివందనం చేస్తున్నా.. ఎన్టీఆర్‌ ఎమోషనల్‌..

NTR: సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) - 2023 వేడుకలు దుబాయ్‌ వేదికగా గ్రాండ్‌గా జరుగుతున్నాయి.

Arun Chilukuri
Published on: 16 Sept 2023 2:51 PM IST
Jr NTR Emotional Speech About his at SIIMA Awards 2023 Function
X

Jr NTR: వారు లేకుంటే నేను లేను.. తలవంచి పాదాభివందనం చేస్తున్నా.. ఎన్టీఆర్‌ ఎమోషనల్‌..

NTR: సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) - 2023 వేడుకలు దుబాయ్‌ వేదికగా గ్రాండ్‌గా జరుగుతున్నాయి. 2 రోజులపాటు నిర్వహించనున్న ఈ అవార్డు వేడుకల్లో సినీనటులు హాజరుతో కోలాహలంగా మారింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమాలో అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్‌గా అవార్డు అందుకున్నారు. అవార్డ్ అందుకున్న ఎన్టీఆర్ తన మాటలతో అభిమానుల హృదయాలను ఉద్వేగానికి గురిచేశారు.

‘‘అభిమానులు నాకు ప్రతినిత్యం తోడుగా ఉన్నారు. నా ఒడుదొడుకుల్లో అండగా ఉన్నారు. కిందపడ్డ సమయంలో తోడుగా నిలిచి, నన్ను పట్టుకుని ఉన్నత స్థితికి తీసుకొచ్చారు. నా కంటి నుంచి వచ్చిన ప్రతి బొట్టుకు వాళ్లూ బాధపడ్డారు. నా సంతోషంలో పాలు పంచుకున్నారు. నన్ను అభిమానించే వారందరికీ పాదాభివందనం చేస్తున్నాను. ఇక కొమురం భీమ్‌ లాంటి అద్భుతమైన పాత్రను నాకు అప్పగించినందుకు రాజమౌళికి ధన్యవాదాలు’’ అంటూ చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’లో నటిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియాగా తెరకెక్కుతోంది. భారీ యాక్షన్‌ సన్నివేశాలను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాలో ఎన్టీఆర్‌ సరసన బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ నటిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story