36 ఏళ్ల వయసులో నాని క్రికెటర్ అవ్వగలడా?

Nani
x
Nani
Highlights

వరుసగా 'కృష్ణార్జున యుద్ధం' మరియు 'దేవదాస్, సినిమాలతో రెండు డిజాస్టర్ లను అందుకున్న నాని ఇప్పుడు 'జెర్సీ' అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు 'మళ్లీ రావా' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు.

వరుసగా 'కృష్ణార్జున యుద్ధం' మరియు 'దేవదాస్, సినిమాలతో రెండు డిజాస్టర్ లను అందుకున్న నాని ఇప్పుడు 'జెర్సీ' అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు 'మళ్లీ రావా' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ 'యూటర్న్' సినిమా లో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ ఈ సినిమా ద్వారా తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాలో నాని క్రికెటర్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తో అంచనాలను పెంచిన దర్శక నిర్మాతలు ఈ రోజు టీజర్ వీడియోను విడుదల చేశారు.

ఒక నిమిషం 28 సెకండ్ల నిడివిగల ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతుంది. సినిమా స్టోరీ ఎలా ఉండబోతోందో టీజర్ తో చెప్పకనే చెప్పారు దర్శక నిర్మాతలు. 36 ఏళ్ల అర్జున్ పాత్రలో కనిపించనున్న నాని క్రికెటర్ అవుదాం అనుకుంటాడు కానీ అతని స్నేహితుల దగ్గర నుంచి భార్య వరకు అందరూ అతనికి వద్దని, తనవల్ల కాదని చెబుతూ ఉంటారు. కానీ వారందరినీ ఎదుర్కొని అర్జున్ ఎలా క్రికెటర్ అయ్యాడు అనే అంశంపై సినిమా నడుస్తున్నట్లు తెలుస్తోంది. అనిరుధ్ అందించిన సంగీతం పరవాలేదనిపించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కానుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories