Jathi Ratnalu: ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..టార్గెట్ రీచ్ అయ్యారా?

Jathi Ratnalu: నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలలో అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన చిత్రం 'జాతిరత్నాలు'.

Samba Siva Rao
Updated on: 15 March 2021 2:33 PM IST
jathi rathnalu movie  collections
X

జాతిరత్నాలు ఫైల్ ఫోటో  

Jathi Ratnalu: నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలలో అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన చిత్రం 'జాతిరత్నాలు'. మార్చి 11వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలకు ముందే బెస్ట్ ప్రమోషన్స్ దక్కడంతో.. తొలి రోజే భారీ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. తొలి రోజు నుంచే ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ రన్ చూసిన జనం మౌత్ టాక్ పాజిటివ్‌గా రావడంతో వరుసపెట్టి నాలుగురోజుల పాటు బెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక నాలుగో రోజు వీకెండ్ కావడంతో ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్ వచ్చాయి.

నాలుగో రోజు ఈ సినిమా ఐదు కోట్ల రూపాయలుపైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా నాలుగో రోజు 5.33 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఓవరాల్ కలెక్షన్లు చూస్తే 27 కోట్ల రూపాయలు గ్రాస్ రాగా.. 16.52 కోట్ల రూపాయలు వచ్చాయి. ఈ సినిమా 11.50 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగి ఆ ఫీట్ అధిగమించింది. ఇక సోమవారం నుంచి ఈ సినిమా కలెక్షన్స్ డల్ అయ్యే అవకాశం.

జాతిరత్నాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నాలుగు రోజుల వసూళ్లు చూస్తే..

  • తొలిరోజు రూ 3.94 కోట్లు,
  • రెండో రోజు - రూ. 2.97
  • మూడో రోజు - రూ.4.28
  • నాలుగో రోజు - రూ. 5.33 కోట్లు
  • మొత్తంగా చూస్తే:- Rs 16.52 కోట్లు రాబట్టింది. రూ. 27 కోట్లు గ్రాస్ రాబట్టింది.

నాలుగో రోజు వసూళ్లు చూస్తే..

నైజాం ఏరియాలో రూ. 2.61, సీడెడ్: రూ.68 లక్షలు, యూఎస్: రూ. 71 లక్షలు, ఈస్ట్: రూ. 27 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 24 లక్షలు, గుంటూరు జిల్లాలో రూ. 36 లక్షలు, కృష్ణ జిల్లాలో రూ. 32 లక్షలు, నెల్లూరు రూ. 14 లక్షలు, ఆంధ్ర - తెలంగాణ: రూ. 5.33 కోట్లు, రూ.8.22 గ్రాస్ రాబట్టింది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story