Jathi Ratnalu 3 Days Collection: అక్కడ 'ఉప్పెన' రికార్డ్ బ్రేక్‌

Jathi Ratnalu 3 Days Collection: నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలలో అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన చిత్రం 'జాతిరత్నాలు'.

Samba Siva Rao
Published on: 14 March 2021 4:51 PM IST
jathi rathnalu movie  collections
X

జాతిరత్నాలు ఫైల్ ఫోటో

Jathi Ratnalu 3 Days Collection: నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలలో అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన చిత్రం 'జాతిరత్నాలు'. మార్చి 11వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలకు ముందే బెస్ట్ ప్రమోషన్స్ దక్కడంతో.. తొలి రోజే భారీ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. తొలి రోజు నుంచే ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ రన్ చూసిన జనం మౌత్ టాక్ పాజిటివ్‌గా రావడంతో వరుసపెట్టి మూడురోజుల పాటు బెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి.

ఈ సినిమా 11.50 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగి ఆ ఫీట్ అధిగమించింది. తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.28 కోట్ల రూపాయలు వసూలు చేసింది మూడో రోజున ఎక్కువ కలెక్ట్ చేసిన చిత్రాల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది.ఈ లిస్టులో తొలి స్థానంలో 'ఉప్పెన' (8.26 కోట్లు), రామ్ ఇస్మార్ట్ శంకర్ (4.32 కోట్లు), నితిన్ భీష్మ (4.31 కోట్ల)చిత్రాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఓవర్‌సీస్ లోనూ 'జాతరత్నాలు' హంగామా చేస్తుంది. అమెరికాలో హాఫ్ మిలియన్ మార్కును దాటేసి.. లాక్‌డౌన్ తర్వాత ఈ రేంజ్ కలెక్షన్లు అందుకున్న తొలి సినిమాగా నిలిచింది. ఇప్పటి వరకు వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. మొత్తంగా చూస్తే ఈ మూడు రోజుల్లోనే 2.97 కోట్లు రూపాయలు లాభాలను అందుకొని సత్తా చాటింది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story