Jathi Ratnalu Collections: కలెక్షన్లతో షాకిస్తోన్న జాతిరత్నాలు

Jathi Ratnalu Collections: శివరాత్రి సందర్భంగా రిలీజ్ అయిన 'జాతి రత్నాలు' సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది.

Venkata Chari
Published on: 13 March 2021 5:07 PM IST
Jathi Ratnalu Movie 2nd Day Collections
X

జాతి రత్నాలు సినిమా పోస్టర్ (ఫొటో ట్విట్టర్)

Jathi Ratnalu Collections: శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'జాతి రత్నాలు' సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై అంచనాలు పీక్స్ చేరాయి. అలాగే రిలీజ్ తర్వాత తన సత్తా చాటుతూ, కలెక్షన్స్‌లోనూ ఔరా అనిపిస్తుంది. ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' వంటి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నటించిన ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. కొత్త దర్శకుడు అనుదీప్ కేవీ రూపొందించిన ఈ చిత్రం ద్వారా మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మాతగా మారాడు. రాధన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

రెండు రోజుల కలెక్షన్స్...

మొదటి రోజు నుంచే 'జాతి రత్నాలు' హిట్ టాక్ తో కలెక్షన్స్ లో తన సత్తా చాటుతోంది. మొదటి రోజు రూ. 3.94 కోట్లు వసూలు చేసింది. అలాగే రెండో రోజు ఈ చిత్రం రూ. 2.80 కోట్లు రాబట్టింది. దీంతో మొత్తం రెండు రోజుల్లోనే రూ. 6.74 కోట్లు షేర్, రూ. 11.35 కోట్ల గ్రాస్ అందుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా...

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో కలిపి రూ. 6.74 కోట్లు షేర్ వసూలు చేసిన ఈ సినిమా.. రెస్టాఫ్ ఇండియాలో రూ. 30 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.55 కోట్లు రాబట్టింది. దీంతో రెండు రోజులకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.59 కోట్లు షేర్‌తో పాటు రూ. 14.20 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. కాగా ఈ సినిమా రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ చేయడంతో.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.50 కోట్లుగా నమోదైంది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ. 2.91 కోట్లు వసూలు చేస్తే సరిపోతుంది. ఆదివారం కల్లా బ్రేక్ ఈవెన్ దాటి పోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story