Faria Abdullah: ఢీ సీక్వెల్ లో ఫారియా అబ్దుల్లా

Jathi Ratnalu Fame Faria Got Crazy Project
x
ఫారియా అబ్దుల్ల (ఫైల్ ఇమేజ్)
Highlights

Faria Abdullah: ఈఫిల్ టవర్ అందాలు ముత్యాలు విసిరే నవ్వులు.. నయా హీరోయిన్ ఫారియా అబ్దుల్లా క్రేజే వేరు ఇప్పుడు.

Faria Abdullah: ఈఫిల్ టవర్ అందాలు... ముత్యాలు విసిరే నవ్వులు.. చిలిపిగా మాట్లాడే కళ్లు.. నయా హీరోయిన్ ఫారియా అబ్దుల్లా క్రేజే వేరు ఇప్పుడు. జాతి రత్నాలు సినిమాతో యూత్ హార్ట్స్ లో టెంట్ వేసేసుకున్న ఈ బ్యూటీ కొత్తగా క్రేజీ ప్రాజెక్టులో కన్ ఫామ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీను వైట్ల కసిగా తీస్తున్న ఢీ సీక్వెల్ లో మంచు విష్ణు సరసన ఈ పొడుగు సుందరి నటించబోతుంది.

మంచు విష్ణు హీరోగా.. శ్రీను వైట్ల డైరెక్షన్‌లో తెరకెక్కతున్న చిత్రం ఢీ2. ఢీ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విష్ణు సరసన ఫారియా అబ్దుల్లా హీరోయిన్గా ఫిక్సై పోయారట. రీసెంట్‌ గా జాతిరత్నాలు చూసిన ఈ మూవీ మేకర్స్‌ చిట్టీ కామెడీ టైమింగ్‌ నచ్చడంతో.. ఢీ2లో కూడా ఈ బ్యూటీనే తీసుకోవాలని ఫిక్సైపోయారట. కామెడీ టైమింగ్‌కి తోడు హైట్‌తో విష్ణును మ్యాచ్‌ చేస్తుడండంతో మంచు వారబ్బాయికి ఈ అమ్మాయే కరెక్ట్‌ అంటూ శ్రీను వైట్ల ఫిక్స్‌ అయిపోయారట. ఇప్పుడిదే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇక యాక్షన్ కామెడీ జానర్లో.. శ్రీనువైట్ల డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రమే "ఢీ". 2007లో రిలీజైన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించి ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. విష్ణు, జెనీలియా కెమెస్ట్రీ… బ్రహ్మనందం, శ్రీహారి, జయప్రకాశ్‌ రెడ్డిల కామెడీ టైమింగ్ వెరసి ఈ సినిమాను ఎవర్‌గ్రీన్‌ లిస్ట్లో చేరేలా చేసింది. ఇక ఇన్నాళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories