Jathi Ratnalu Censor Review: జాతిరత్నాలు సెన్సార్ రివ్యూ!

Jathi Ratnalu Censor Review: జాతి రత్నలు సినిమా మార్చి 11న గ్రాండ్ రిలీజ్ కోసం సిద్ధమవుతోంది.

Venkata Chari
Published on: 8 March 2021 6:20 PM IST
Jathi Ratnalu Censor Review Funtastic Movie Got
X

జాతి రత్నాలు (ఫొటో హన్స్ ఇండియా)

Jathi Ratnalu Censor Review: నవీన్ పొలిశెట్టి హీరోగా, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలుగా రాబోతున్న తెలుగు చిత్రం "జాతి రత్నలు". ఈ చిత్రం మార్చి 11న గ్రాండ్ రిలీజ్ కోసం సిద్ధమవుతోంది. తాజాగా జాతి రత్నాలు సినిమా సెన్సార్ టాక్ ఇంటర్నెట్ లో హల్‌చల్ చేస్తుంది. ఈ టాక్ ప్రకారం జాతిరత్నాలు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ గా నిలవనుంది.

ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో ఉన్న జాతి రత్నలు సెన్సార్ టాక్ ప్రకారం, ఇదొక పూర్తి వినోదాత్మకమైన ఎంటర్‌టైనర్ గా నిలవనుంది. అలాగే సెన్సార్ టీం కూడా ఖచ్చితమైన హిట్ టాక్ అవనుందని మాట్లాడారని సమాచారం. దీంతో ఫిల్మ్ యూనిట్ కూడా విజయంపై చాలా నమ్మకంగా ఉందని తెలుస్తోంది.

ఫరియా అబ్దుల్లా ఈ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కేవీ అనుదీప్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇంతకు ముందు పిట్టగోడ సినిమాకు ఆయన డైరెక్షన్ చేశాడు. నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది.

Venkata Chari

Venkata Chari

Next Story