Jathi Rathnalu: నవ్వి నవ్వి కడుపు చెక్కలవడం ఖాయం..ట్విట్టర్ రివ్యూ

Jathi Rathnalu: "జాతిరత్నాలు" ఫస్టాఫ్ అదిరిపోయిందని ట్వీట్ చేస్తున్నారు.

Samba Siva Rao
Updated on: 11 March 2021 10:49 AM IST
jathi rathnalu movie  review
X

జాతిరత్నాలు సినిమా ఇమేజ్ (ట్విటర్ )

Jathi Rathnalu: నవీన్ పొలిశెట్టి హీరోగా వచ్చిన'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' అంచనలకు మించి సూపర్ హిట్ అయింది. ఆ సినిమా కడుపుబ్బా నవ్వించడంతో పాటు మంచి క్రైమ్ థ్రిల్లర్‌ను ప్రేక్షకులకు అందించాడు నవీన్. ఆ తర్వాత నవీన్ పొలిశెట్టి దాదాపు 2 ఏళ్ల విరామం తర్వాత మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నవీన్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో 'జాతిరత్నాలు' అనే మూవీ మహాశివరాత్రి సందర్బంగా గురువారం‎ (మార్చి 11న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

స్వప్న సినిమా బ్యానర్‌పై నాగ్ అశ్విన్ ఈ ఈ చిత్రాన్ని నిర్మించగా.. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించాడు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. యూఎస్‌లో ప్రీమియర్ షోలో పడ్డాయి. అక్కడ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

సినిమా చూసిన ప్రేక్షకులు "జాతిరత్నాలు" ఫస్టాఫ్ అదిరిపోయిందని ట్వీట్ చేస్తున్నారు. కామెడీ టైమింగ్ అద్బుతంగా ఉందని, వన్ టైమ్ పంచ్‌లు అద్భుతంగా పేలాయని. నవీన్ పొలిశెట్టి మరోసారి తన అద్భుతమైన నటనతో కట్టిపడేశారని ప్రశంసిస్తున్నారు. నవీన్, ప్రియదర్శి, రాహుల్.. ఈ ముగ్గురు కాంబినేషన్‌లో వచ్చే ప్రతి సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుందని అంటున్నారు.

ఫస్ట్ ఆఫ్ బ్లాక్ బస్టర్ అని, ఇక ద్వితీయ భాగం వచ్చే సరికి అబౌవ్ యావరేజ్‌గా ఉందని కొంత మంది ప్రేక్షకులు ట్వీట్స్ చేశారు. మొత్తంగా ఇది హిట్టు బొమ్మ అని తీర్పు ఇచ్చేశారు. 'జాతిరత్నాలు' కామెడీ అనేది పవర్‌ఫుల్ జానర్‌ అని మరోసారి ప్రూవ్ చేసిందని కొనియాడుతున్నారు. నవీన్ పొలిశెట్టి తన ఖాతాలో మరో హిట్టు వేసుకున్నారు. ఈ సినిమా తొలి రోజే బడ్జేట్ వస్తుందని ఆడియోన్స్ ట్వీట్ చేస్తున్నారు.






Samba Siva Rao

Samba Siva Rao

Next Story