పెయిన్ కిల్లర్లు వాడుతూ షూటింగ్ చేసిన స్టార్ హీరోయిన్

*పెయిన్ కిల్లర్లు వాడుతూ షూటింగ్ చేసిన స్టార్ హీరోయిన్

Rama Rao
Published on: 2 Nov 2022 7:30 AM IST
Janhvi Kapoor Shot in a Freezer for Mili Film | Telugu Movie News
X

పెయిన్ కిల్లర్లు వాడుతూ షూటింగ్ చేసిన స్టార్ హీరోయిన్

Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈమధ్య వరుస సినిమా రిలీజ్ లతో బిజీగా ఉంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన "హెలెన్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న "మిల్లి" శుక్రవారం నవంబర్ 4 న థియేటర్లలో విడుదల కాబోతోంది. మత్తు కుట్టి జేవియర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను బాగానే అలరించింది. ఒక ఫ్రీజర్ లో లాక్ అయిపోయిన జాన్వి ఎలా బయటపడింది అనే కాన్సెప్ట్ తో ఈ సర్వైవల్ థ్రిల్లర్ త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని డైరెక్టర్ నిజంగానే ఒక ఫ్రీజర్ లో షూట్ చేశారట. ఆ ఫ్రీజర్ లో టెంపరేచర్ 15 డిగ్రీస్ ఉండేదని తెలుస్తోంది. ఒక రోజుకి దాదాపు 15 గంటలపాటు జాన్వి కపూర్ అదే ఫ్రీజర్ లో ఉండాల్సి వచ్చేదట. సినిమా కోసం జాన్వి కపూర్ 7.5 కేజీలు పెరిగింది. "చాలా వరకు షూటింగ్ ఫ్రీజర్ లో ఏడుస్తూ ఉండాల్సి వచ్చేది. దానివల్ల నా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఇంటికెళ్లాక కూడా ఆ ఫ్రీజర్ లో ఉన్నట్లే అనిపించేది.

ఒకసారి ఆరోగ్యం చెడినప్పుడు రెండు మూడు రోజులపాటు పెయిన్ కిల్లర్లు వాడుతూనే షూటింగ్ చేయాల్సి వచ్చింది," అని చెప్పుకొచ్చింది జాన్వి కపూర్. ఇక రొటీన్ కమర్షియల్ సినిమాలకి దూరంగా ఉంటూ మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలతో తన కెరియర్లో ముందుకు దూసుకుపోతున్న జాన్వి కపూర్ ఈమధ్యనే తమిళంలో సూపర్ హిట్ అయిన "కొలమావు కోకిల" సినిమాకి రీమేక్ "గుడ్ లక్ జెర్రీ" తో మంచి హిట్ అందుకుంది.

Rama Rao

Rama Rao

Next Story