ఎన్టీఆర్ తో సినిమా పై స్పందించిన జాన్వీ కపూర్

Janhvi Kapoor: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ ఇప్పటికే బోలెడు పుకార్లు వినిపించాయి.

Arun Chilukuri
Published on: 3 Aug 2022 3:27 PM IST
Janhvi Kapoor Opens up About Chance to Work With Jr NTR
X

ఎన్టీఆర్ తో సినిమా పై స్పందించిన జాన్వీ కపూర్ 

Janhvi Kapoor: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ ఇప్పటికే బోలెడు పుకార్లు వినిపించాయి. ఇప్పటికే రామ్ చరణ్, మహేష్ బాబు, బన్నీ, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలతో సినిమాలో సైన్ చేసింది అంటూ చాలా ప్రచారం జరిగింది కానీ దేనికి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. తాజాగా కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమాకి కూడా జాన్వీ కపూర్ ని హీరోయిన్ పాత్ర కోసం సంప్రదించారట.

కానీ ఆమె ఇంకా ఈ ప్రాజెక్టుకి ఒకే చెప్పలేదని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటికీ కొరటాల శివ తన సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించాలని కోరుకుంటున్నారట. కానీ ఇంకా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. మరోవైపు బుచ్చి బాబు ఇప్పుడు ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం జాన్వీ కపూర్ ని పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ పుకార్ల పై క్లారిటీ ఇచ్చింది జాన్వీ కపూర్. మీడియా ముఖంగా మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ సార్ తో కలిసి పని చేసే అవకాశం నాకు చాలా విలువైనది అని అన్నారు జాన్వీ కపూర్. అయితే ఇలా తెలివిగా ప్రశ్నకు జవాబు ఇచ్చిన జాన్వీ ఈ సినిమాలో తాను హీరోయిన్ గా నటిస్తుందా లేదా అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా చూడడానికి అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story