జగన్‌-చిరంజీవి భేటీపై మంచు విష్ణు సంచలన కామెంట్స్‌..

Jagan, Chiranjeevi Meeting Personal Says Manchu Vishnu
x

జగన్‌-చిరంజీవి భేటీపై మంచు విష్ణు సంచలన కామెంట్స్‌..

Highlights

Manchu Vishnu: మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలవనున్నారు.

Manchu Vishnu: మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలవనున్నారు. ఈనెల 10న ముఖ్యమంత్రి జగన్‌ను కలుస్తారని సమాచారం. చిరంజీవితో పాటు మరికొంతమంది సినీ పెద్దలు కూడా ముఖ్యమంత్రితో భేటీ అవుతారని సమాచారం. కొద్ది రోజుల క్రితం సీఎం జగన్ ఆహ్వానం మేరకు వెళ్లిన చిరంజీవి సీఎంతో పలు కీలక విషయాలు చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గించడంపై చర్చించినట్లు తెలుస్తోంది. దాంతో పాటు టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సంబంధించి పలు కీలక విషయాలను కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే తాజాగా రెండోసారి సీఎం జగన్‌తో భేటీ అవుతుండడం ఉత్కంఠ రేపుతోంది.

ఇప్పటికే ఉదయం మా అధ్యక్షుడు మంచు విష్ణు సీఎం జగన్‌తో చిరంజీవి భేటీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి సీఎం జగన్‌ను కలవడం ఆయన వ్యక్తిగతమని ఇండస్ట్రీ మొత్తానికి ఆయన భేటీని అపాదించడం సరైంది కాదని కీలక వ్యాఖ్యలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories