Jabardasth : కరోనా తరువాత వస్తున్న ప్రోమో 'ఖతర్నాక్' గా ఉందిగా!

Jabardasth : కరోనా తరువాత వస్తున్న ప్రోమో  ఖతర్నాక్ గా ఉందిగా!
x
Jabardasth comedy show latest promo stills (images from youtube promo)
Highlights

బుల్లితెరపై మళ్ళీ సందడి మొదలవుతోంది. సీరియళ్ళు..కామెడీ షోలు మొదలవుతున్నాయి. తాజాగా ఈటీవీ జబర్దస్త్ కొత్త ఎపిసోడ్ ప్రోమో వదిలింది.

ఈరోజు మీరు అన్ని స్కిట్లకి టెన్ టెన్ ఇవ్వాలి.. ఒకరు టెన్.. ఒకరు నైన్ ఇచ్చారనుకోండి 19 అవుతుంది.. మళ్ళీ కోవిడ్-19 గుర్తుకు వస్తుంది..ఇలా బుల్లితెర మీద ఎవరు పంచ్ వేయగలరు? అదీ జడ్జిలపైన.. అవును.. మీరు అనుకుంటున్నది కరెక్టే..హైపర్ ఆది! జబర్దస్త్ కామెడీ షో మళ్ళీ మొదలవబోతోంది. కరోనా కాటుకు పడ్డ లాక్ డౌన్ నుంచి దొరికిన ఉపశమనంతో ఇప్పుడిప్పుడే టీవీ సీరియళ్ళ షూటింగ్ లు ప్రారంభం అయ్యాయి. ఈటీవీ వేగంగా షూటింగ్ లు పూర్తీ చేసి తిరిగి అన్ని సీరియళ్ళను సోమవారం నుంచి అంటే జూన్ 22 నుంచి ప్రారంభించేస్తోంది. ఇప్పటికే సుమ ఈటీవీ సీరియళ్ళ పునఃప్రారంభ ప్రోమోతో రచ్చ రచ్చ చేశారు.

ఇక ఇప్పుడు జబర్దాస్ట్ వంత్ వచ్చింది. గురువారం జూన్ 25 న మళ్ళీ జబర్దస్త్ తాజా ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. దాదాపు మూడు నెలల తరువాత బుల్లితెరపై జబర్దస్త్ వినోదం కనిపించబోతోంది. ఇక ఇన్నాళ్ళ విరామం తరువాత వచ్చే ఎపిసోడ్ కదా.. దానికి సంబంధించిన ప్రోమోను ఒక రేంజిలో వదిలింది మల్లెమాల టీం.

హైపర్ ఆది ఈ ప్రోమోలో మామూలు పంచ్ లు వేయలేదు. మూడ్నేల్ల కరువు తీరే పంచ్ లతో కడుపుబ్బా నవ్విన్చేశారు. రాజు వచ్చి ఆడికి మా జంటను చూస్తె కుళ్ళుగా ఉంది అంటాడు. దానికి ఆది '' ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. ఆదిగారికి మా జంటను చూస్తె కుళ్ళుగా ఉంది అనడానికి ఆది గారూ.. కుళ్ళిపోయిన మా జంట ఎలావుంది అనడానికి చాలా తేడా ఉందిరా లకిడీ కా పూల్!'' అంటూ వేసిన పంచ్ కి రోజా..మనో పడీ పడీ నవ్వారు.

ఇక ఆరు నిమిషాల ఈ ప్రోమో ఓ స్కిట్ అంత హంగామా చేసింది. రాఘవ కరోనా తో యుద్ధం చేయాలంటూ మొదలెట్టి మాస్క్ మాటున జరిగిన పెళ్ళిలో అడ్డంగా బుక్కయ్యారు. కరోనా నేపధ్యంలో పరిస్థితులపైన సెటైర్ వేసినట్టున్నారు రాఘవ. ఇక అదిరే అభి ఒక రేంజిలో ఆడుకున్నారు. చంటి కూడా ప్రోమోలో మెరుపులు మెరిపించారు.

అన్నిటికన్నా చెప్పుకోవలసింది తాగుబోతు రమేష్ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. వస్తూనే తాగుబోతు పంచ్ లతో ఆకట్టుకున్నారు. నీకేవారంటే ఇష్టం అన్నా అంటే..''మొన్న సిఎం సారూ ప్రెస్ మీట్ లో వైన్ షాపుల సంగతేంటి అని అడిగినాయన ఉన్నాడు చూడూ.. ఆయన వెయ్యి గొంతుల సమానం అంటూ వేసిన పంచ్ అదిరింది.

మొత్తమ్మీద ఈటీవీ జబర్దస్త్ కార్యక్రమాన్ని మరింత చక్కగా చేసి మూడునెలల జబర్దస్త్ అభిమానుల కరువూ ఒకేసారి తీర్చేసినట్టే కనిపిస్తోంది. గురువారం ఎలానూ జబర్దస్త్ వస్తుంది.. ఈలోపు మీరూ ఈ సరికొత్త ప్రోమో చూసేయండి మరి..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories