Jabardasth: నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది.. కాళ్ళూ చేతులూ కట్టేసినా 'ఎమ్మెల్యే రోజా' ఎక్కడా తగ్గలేదు!

Jabardasth: నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది.. కాళ్ళూ చేతులూ కట్టేసినా ఎమ్మెల్యే రోజా ఎక్కడా తగ్గలేదు!
x
MLA Roja, Hyper Adi team in Jabardasth Latest Promo (image from Mallemala youtube video)
Highlights

మీరు విన్నది నిజమే. ఎమ్మెల్యే రోజా కాళ్ళూ చేతులు కట్టేశారు. ఎందుకో తెలుసా? హైపర్ ఆదితో స్కిట్ కోసం. ఇటు ఎమ్మెల్యేగా.. అటు జబర్దస్త్ కార్యక్రమం...

మీరు విన్నది నిజమే. ఎమ్మెల్యే రోజా కాళ్ళూ చేతులు కట్టేశారు. ఎందుకో తెలుసా? హైపర్ ఆదితో స్కిట్ కోసం. ఇటు ఎమ్మెల్యేగా.. అటు జబర్దస్త్ కార్యక్రమం న్యాయనిర్ణేతగా రాణిస్తున్న ఎమ్మెల్యే రోజా ఇప్పుడు హైపర్ ఆది స్కిట్ లో నటించారు. తాజాగా ఆ ప్రోమోను విడుదల చేశారు. అదిప్పుడు వైరల్ అయింది.

అతను అసలే హైపర్ ఆది.. పంచ్ వేస్తె ఎవరికైనా షాక్ తగలసిందే. ఇక ఆమె తెరమీదా..తెర బయటా కూడా ఫైర్ బ్రాండ్. ఆమె నోరు విప్పితే ఎంతటి నాయకులైనా పిల్లుల్లా ముడుచుకు పోవాల్సిందే. ఎవరో చెప్పక్కర్లేదుగా.. ఎమ్మెల్యే రోజా! వీరిద్దరూ ఒకే స్కిట్ లో డ్రామా చేస్తే.. ఎలావుంటుందో తెలుసా? అది చూడాలంటె ఇంకా వారం ఆగాలి. కానీ, ఆ అసలు డ్రామాకి ముందు వదిలిన ప్రోమో చూస్తే మాత్రం రోజానా మజాకానా అనుకోకుండా ఉండలేరు అంతే!

వచ్చేవారం ఈటీవీలో ప్రసారం కానున్న జబర్దస్త్ కామెడీ షో కోసం ఎమ్మెల్యే రోజా హైపర్ ఆది స్కిట్లో నటించారు. రోజాను కుర్చీలో కాళ్ళూ చేతులూ కట్టేసి ఉంచారు ఆది అండ్ టీం. దీంతో ''ఎవడ్రా.. ఒక ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసింది'' అంటూ గట్టిగా అరిచారు రోజా. వెంటనే.. అది తన గ్యాంగ్ తో కల్సి శంకర్ దాదా ఎంబీబీఎస్ పాటతో ఎంట్రీ ఇచ్చారు. తనను ఎర్రగా చూస్తున్న రోజాతో ''మీరు భయపడితే భయపడటానికి మొగుడూ పెళ్ళాలం కాదు.. మగాళ్ళం.. బీపీ తెప్పించకండి'' అంటూ చెప్పాడు ఆది. దానికి వెంటనే రోజా నీకు బీపీ వస్తే నీ కంటెస్టెంట్స్ వణుకుతారేమో..నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది అంటూ గర్జించారు రోజా. ''స్కిట్లు చేస్తున్నపుడు మీరు జడ్జి స్థానములో కూచుని కౌంటర్లు వేస్తున్నారు.. అందుకే మిమ్మల్ని కట్టేసి మేము కౌంటర్లు వేసుకోవడానికి సిద్ధం అయ్యాం అన్నాడు ఆది. మీరు కౌంటర్లు వేయాలంటే స్క్రిప్ట్ రాయాలి.. రిహార్సల్స్ చేయాలి.. నేను కౌంటర్ వేయాలంటే హేంగర్ కు ఉన్న చీర కట్టుకువచేస్తే చాలు'' అంటూ రోజా స్ట్రాంగ్ కౌంటర్ వేశారు.

ఇలా సాగిన ఈ ప్రోమో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారిపోయింది. ఇన్నేళ్లయినా రోజా నటనలో కొంచెం కూడా తగ్గలేదని ప్రోమో చూసిన వారంటున్నారు. మరోవైపు ఆది తన స్కిట్ తో రోజాతో వేయించిన పంచ్ డైలాగులకు అందరూ ఫిదా అయిపోతున్నారు.

మొత్తమ్మీద ఎమ్మెల్యే రాజాని కాళ్ళూ చేతులు కట్టేసి కూచోపెట్టినట్టే.. తన పంచ్ లతో వారం వారం హైపర్ ఆది జబర్దస్త్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. దానికి రోజా కూడా చక్కని సహకారం అందిస్తుండడంతో జబర్దస్త్ కార్యక్రమం దూసుకుపోతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories