Hyper Aadi: తప్పులో కాలేసిన హైపర్ ఆది.. అడ్డంగా దొరికాడు!

Hyper Aadi: తప్పులో కాలేసిన హైపర్ ఆది.. అడ్డంగా దొరికాడు!
x
Hyper Adi (file photo)
Highlights

అవతల వున్నది ఎవరనేది చూసుకునే పనిలేదు.. ఏ అంశం మీద మాటలు విసురుతున్నారనే విషయమూ అవసరం లేదు. ఛాన్స్ దొరికిందా ఇక అంతే.. పంచ్ డైలాగులతో...

అవతల వున్నది ఎవరనేది చూసుకునే పనిలేదు.. ఏ అంశం మీద మాటలు విసురుతున్నారనే విషయమూ అవసరం లేదు. ఛాన్స్ దొరికిందా ఇక అంతే.. పంచ్ డైలాగులతో విరుచుకుపడిపోవడంలో దిట్ట జబర్దస్త్ హైపర్ ఆది. సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలేసి తనకున్న ఆ మాటలు విసిరే బలంతోనే జబరదస్త్ షో కి వచ్చి అక్కడ ఆది లేకపోతే ఎలా అనేంతగా పాతుకుపోయాడు. ఇప్పుడు జబర్దస్త్ తో పాటు మరో షో లోనూ తన ప్రతాపాన్ని చూపిస్తూ టెలివిజన్ రంగంలో దూసుకుపోతున్నాడు. ఇక సినిమాల్లోనూ వరుసగా నటిస్తూ బిజీ బిజేగా ఉన్నాడు హైపర్ ఆది. ఇప్పుడు కామెడీ స్టార్ గా చాలా అభిమానులను సొంతం చేసుకున్నాడు ఆది.

ఎలా పడితే అలా పంచులు విసిరే ఆది..చిన్న విషయంలో నెటిజన్లకు దొరికిపోయాడు. దీంతో నెటిజన్లు ఆదేసుకున్నారు. తప్పు గమనించి దానిని సరిచేసుకునేలోపు ఆ ఇమేజిలు వైరల్ అయిపోయాయి. అసలేం జరిగింద్నాటే.. ఈరోజు ప్రముఖ నటుడు ఎంఎస్ నారాయణ వర్థంతి. అందుకోసం ఆది ఓ ఫోటోను తన ఫేస్ బుక్ లో షేర్ చేశాడు. అందులో తప్పేముంది అంటారా? అదే చెబుతున్నాము.. పాపం ఆయనకు వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించబోయి.. హ్యాపీ బర్త్ డే అంటూ జన్మదిన శుభాకాంక్షలు చెప్పేశాడు ఆది. నిజానికి ఆ ఫోటో శ్రేయాస్ మీడియా ఎం.ఎస్.నారాయణకు నివాళులు చెబుతూ షేర్ చేసిన ఫోటో. దానిని యధాతథంగా తీసుకున్న ఆది దానికి ఇచ్చిన క్యాప్షన్ విషయంలో తప్పులో కాలేశాడు.


ఇక ఆది ఇలా దానిని పోస్ట్ చేశాడో లేదో.. ఆ ఫేస్ బుక్ పోస్ట్ కు లైకుల వర్షం మొదలైంది. ఈలోపు ఆది మీద కసి ఉన్న కొందరు ట్రోలింగ్ మొదలు పెట్టేశారు. దీంతో నాలుక కరచుకున్న ఆది ఆ పోస్ట్ ను డిలీట్ చేశాడు. కానీ అప్పటికే ఆ పోస్ట్ ఇమేజి రూపంలో నేట్టింట్లో షికార్లు మొదలు పెట్టింది. దీంతో ఆది వెంటనే మరో పోస్ట్ ఆ పోస్ట్ స్థానంలో పెట్టాడు. దీనిలో ఎం.ఎస్.నారాయణకు నివాళులు అర్పించాడు. అందుకే నాయనా సోషల్ మీడియాలో ఏదన్నా విషయం ఉంచే ముందు జాగ్రత్తగా ఉండాలనేది. ఇక్కడ దొరికావా.. స్టేజి మీద నీ పంచ్ లకు మించిన పంచ్ లతో దునియా మొత్తం దున్నేస్తారు అంటున్నారు నెటిజన్లు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories