పవన్ సినిమాలో ఆఫర్ కొట్టేసిన అనసూయ

K V D Varma
Updated on: 4 Feb 2020 6:03 PM IST
పవన్ సినిమాలో ఆఫర్ కొట్టేసిన అనసూయ
X

జబర్దస్త్ తో తెలుగు టీవీ యాంకరింగ్ కు గ్లామర్ అద్దిన తార అనసూయ. తన గ్లామర్ తో జబర్దస్త్ షో ని మరో లెవెల్ కి తీసుకువెళ్లారామె. ఇక అక్కడ నుంచి బుల్లితెర పై యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజితో దూసుకువెళ్ళిపోతున్నారు అనసూయ. ఇక అక్కడ నుంచి ఆమె సినిమాల వేపు ప్రయాణం మొదలు పెట్టారు. అయినా, బుల్లి తెరను విడిచి పెట్టలేదు. అక్కడ ఫుల్ టైం చేస్తూ వెండితెర మీద అడపాదడపా మంచి పాత్రలతో మెరుస్తూ వస్తున్నారు. ఆమె నటించిన రంగస్థలం.. క్షణం సినిమాల్లో పాత్రలకు ఎంతో పేరు వచ్చింది. ముఖ్యంగా మెగా హీరో రామ్ చరణ్ లీడ్ రోల్ లో నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త గా ప్రేక్షకులని మెస్మరైజ్ చేశారు అనసూయ. అటు తరువాత ఆమె కథనం అనే సినిమాలో లీడ్ రోల్ చేశారు. సినిమా మొత్తం ఆమె చుట్టూనే నడుస్తుంది. సినిమాకి డివైడ్ టాక్ వచ్చినా.. అనసూయ మాత్రం నటిగా వంద మెట్లెక్కినట్టయింది

ఇక ప్రస్తుతం ఆమె టీవీల్లోనూ మూడు షో లలో కనిపిస్తున్నారు. ఇప్పుడు బన్నీ-సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రంలో విలన్ గా నటిస్తోందని ఫిలింనగర్ టాక్. రంగస్థలంతో నటిగా అనసూయను ఒక రేంజిలో ప్రెజెంట్ చేసిన సుకుమార్ ఇప్పుడు ఆమెను విలన్ గా వెండితెరమీద చూపించ బోతుండడం.. అదీ అల్లు అర్జున్ సినిమాలో కావడం విశేషంగా చెప్పుకుంటున్నారు.

ఇదిలా ఉండగా, తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సినిమాలో బంపర్ ఆఫర్ అనసూయ కొట్టేశారని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాన్ హిందీ పింక్ రీమేక్ లో నటిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక దాని తరువాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్నారు. ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం జబర్దస్త్ అనసూయను తీసుకున్నట్టు టాలీవుడ్ టాక్. సినిమాలో అతి కీలకమైన ఈ పాత్ర అరగంట మాత్రమె ఉంటుందట. కానీ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాలో చాన్స్ అనసూయకు దక్కడంతో ఆమె వరుసగా మెగా ఫ్యామిలీ సినిమాల్లో కనిపించినట్టవుతోంది. ఏది ఏమైనా టాలెంట్ ఉంటె ఎప్పటికైనా టాలీవుడ్ లో చాన్స్ లు దొరుకుతాయని అనసూయ నిరూపిస్తున్నారు.

K V D Varma

K V D Varma

Next Story