ఎన్టీఆర్ కు 'భారతరత్న' డిమాండ్ ఆ వేదిక మీద రానుందా?

ఎన్టీఆర్ కు భారతరత్న డిమాండ్ ఆ వేదిక మీద రానుందా?
x
Highlights

తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడు పౌర పురస్కారాల కోసం తెరవెనుక యుద్ధాలు సాగుతున్నట్టు కనిపిస్తోంది. సాధారణంగా పద్మ శ్రీ, పద్మభూషణ్ వంటి భారత ఉన్నత పౌర...

తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడు పౌర పురస్కారాల కోసం తెరవెనుక యుద్ధాలు సాగుతున్నట్టు కనిపిస్తోంది. సాధారణంగా పద్మ శ్రీ, పద్మభూషణ్ వంటి భారత ఉన్నత పౌర పురస్కారాలలో సినిమా కేటగిరీ కింద ప్రతి సంవత్సరం ఎవరో ఒకరికి అవార్డులు రావడం సహజంగా జరిగేదే. దానికోసం తమకు అర్హత ఉంది అని భావించిన వారు ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేయడమూ సహజమే. అదే విధంగా అవార్డుల కోసం తెరవెనుక పైరవీలు జరగడమూ తెలిసిన విషయమే. అయితే, ఇప్పుడు కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. అవార్డుల కోసం డిమాండ్ చేయడం.

మొన్న సరిలేరు నీకెవ్వరూ వీడ్కలో కృష్ణకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలన్న డిమాండ్ వచ్చింది. నిన్న అల వైకుంఠపురములో సంగీతోత్సవం లో ఆలు అరవింద్ కి పద్మశ్రీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.. మరి ఇక ఆ లెక్క సరిపోవాలంటే.. ఈరోజు జరగనున్న నందమూరి కళ్యాణ్ రామ్ ఎంత మంచి వాడవురా వేడుకలో ఎన్టీఆర్ కు భారత రత్న డిమాండ్ చేస్తారా? ప్రస్తుతం సినీ వర్గాలు..అభిమానుల్లో వెల్లువెత్తుతున్న అనుమానం ఇది!

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతి విషయానికీ పోటీ పెరిగిపోయింది. ముఖ్యంగా అగ్రహీరోలుగా చెలామణీ అవుతున్న వారి కుటుంబాల నుంచి వచ్చిన నట వారసుల మధ్య తీవ్రమైన పోటీ ఉంటోంది. సినిమాలు చేయడం విషయంలో కావచ్చు.. విడుదల చేయడం విషయంలో కావచ్చు.. సినిమా వేడుకలు నిర్వహించడం లో కావచ్చు అన్నిటిలోనూ ఒకరి కంటే ఒకరు పై చేయి అనిపించుకోవాలని ధ్యాస ఎక్కువగా కనబడుతోంది. మేమంతా ఒక్కటే అని పైకి చెప్పినా సినిమా అనేసరికి మాత్రం ఒకరిపై ఒకరు పై చేయి సాధించడానికి విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సినిమాల విషయంలో వారు చేసే ప్రయత్నాలే ఇంత వరకూ పైకి కనిపించేవి. వాటికి సంబంధించిన విశేషాలే వినిపించేవి.

కానీ, ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైందనిపిస్తోంది. అది అవార్డుల కోసం బహిరంగంగా విజ్ఞాపనలు చేయడం. అదీ.. తమ సినిమాకి సంబంధించిన వేదికలపై నుంచి వెలది మంది అభిమానుల సమక్షంలో ఇలా కోరడం కొంచెం వింతగా అనిపిస్తోంది. అవార్డుల కోసం విజ్ఞాపనలు చేయడం విషయంలో తప్పు పెట్టాల్సిన పనిలేదు. కానీ, బహిరంగంగా ఇది మా డిమాండ్ అన్నట్టుగా అగ్రశ్రేణి నటులు చెప్పడం కొంచెం ఇబ్బందికర విషయమే.

కృష్ణకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలి!

మొన్న జరిగిన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా ప్రై రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి కృష్ణకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని బహిరంగ వేదిక పైనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను డిమాండ్ చేశారు. ఆ వేడుకలో అయన ముఖ్య అతిథిగా పాల్గొని సినీ కుటుంబం అంతా ఒక్కటే.. ఎవరి సినిమా విడుదలైనా విజయం సాధించాలని కోరుకుంటాం. అంటూ పేర్కొన్నారు. అటుపై మరో అడుగు ముందుకేసి కృష్ణ కుటుంబంతో తనకు సాన్నిహిత్యం చాలా ఉందని చెప్పినట్టుగా.. కృష్ణకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రస్తావన తెచ్చారు.

మా నాన్నకు పద్మశ్రీ ఇవ్వాలి!

ఇదొక వింత డిమాండ్. అల్లు అర్జున్ చేశారు. తాను నటించిన ఆలా వైకుంఠపురములో.. సినిమా సంగీతోత్సవాన్ని సరిగ్గా సరిలేరు.. వేడుక జరిగిన మర్నాడే నిర్వహించారు. (ఈ రెండు సినిమాల విడుదల కూడా అలాగే జనవరి 11, 12 తేదీల్లో వరుసగా ఉన్నాయి) ఆ ఉత్సవంలో ఒకింత భావోద్వేగంతో మాట్లాడిన అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్ కు పద్మశ్రీ ఇవ్వాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

ఇప్పుడు ఈ రెండు ప్రతిపాదనలపైనా సినీ పరిశ్రమలో పెద్ద చర్చే నడుస్తోందని తెలుస్తోంది. ఇక్కడ అవార్డుల అర్హతలు వంటి విషయాలు పక్కన పెడితే, ఈ డిమాండ్ చేసిన విధానమే చర్చనీయాంశం అయింది. ఇప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా తన ఎంత మంచివాడవురా.. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ బుధవారం నిర్వహిస్తున్నారు. దీంతో అందరి దృష్టి అయన మీద పడింది. అంతే కాకుండా ఈ వేడుకకి జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతున్నారు. దీంతో ఈ వేదిక పై నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) కు భారత రత్న వివ్వాలని డిమాండ్ చేస్తారా? అని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోందని తెలుస్తోంది. ఎందుకంటే, ఎన్ఠీఆర్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ఇంత వరకూ ఇది రాజకీయ వర్గాల్లోనూ.. ఆ వేదికల మీదే ఎక్కువగా వినిపిస్తూ వస్తోంది. కానీ, ఇటీవల సినిమా వేదికల మీద ఆయా కుటుంబాలు చేసిన డిమాండ్ ల నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం కూడా తమ సినిమా వేడుకలో కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ లేవనెత్తుతారని సినీ వర్గాలు, అభిమానులు భావిస్తున్నారు. ఇది ఎంతవరకూ నిజం అవుతుందో తెలీదు కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నత పౌర పురస్కారాలకు బహిరంగ వేదికల్లో డిమాండ్లు వెల్లువెత్తుతుండడం ఆలోచించవలసిన విషయంగా మారిపోయింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories