నిజంగా నాగబాబు ఆ షో వదిలేశారా? జబర్దస్త్ తరువాతి జడ్జి బండ్ల గణేషా?
'జబర్దస్త్' నుంచి నాగబాబు బయటకు వచ్చేశారనే వార్త కొన్ని రోజులుగా విపరీతంగా జరుగుతున్న ప్రచారం సంచలనంగా మారింది.
బుల్లితెర పై మెరుపులు మెరిపించిన కథలెన్నో ఉన్నాయి. సంచలనం సృష్టించిన సీరియల్స్ కి లెక్కేలేదు. కిక్కెక్కించిన గేమ్ షోలకు కొదవే లేదు. కానీ, అన్నిటినీ మించి తెలుగు టెలివిజన్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించిన కార్యక్రమం ఏదైనా ఉందంటే అది ఈటీవీ 'జబర్దస్త్' మాత్రమే అనడం లో అతిశయోక్తి లేదు. జబర్దస్త్ టీఆర్ఫీ రేటింగ్ ల పరంగా సృష్టించిన సంచలనం ఒక ఎత్తైతే, ఆ కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చిన ఎందరో కళాకారులకు బంగారు భవిష్యత్ ఇచ్చిన ప్లాటుఫామ్ గా నిలబడిన వైనం మరో ఎత్తు. ఇక ప్రేక్షకుల్లో అయితే జబర్దస్త్ కార్యక్రమం అంటే చాలు ఎంతో అభిమానం. ఈ కార్యక్రమం ప్రసారమైన సమయంలో చూసిన వారికంటే.. యూట్యూబు లో వీక్షించిన వారి సంఖ్య కొట్ల లో ఉంటుంది.
జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలు గా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజా లకైతే ఇది అద్భుతమైన వేదికగా నిలిచింది. జబర్దస్త్ అంటేనే నాగబాబు అనేంతగా నాగబాబు ఈ షో కి ముఖ్యమైన వారీగా మారిపోయారు. సాధారణంగా ఇటువంటి కార్యక్రమాలలో న్యాయనిర్ణేతలు స్టేజి పై కూచుని తమ పని కానిచ్చి వెళ్ళిపోతారు. కానీ, ఈ జబర్దస్త్ జడ్జీలు మాత్రం పూర్తిగా కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. తమ అభిప్రాయాలు చెబుతారు. తమ అనుభవంతో నటులకు సలహాలిస్తారు. స్కిట్ల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ సహకరిస్తూ వస్తారు. ఇక తెరపై కనిపించే సమయంలో నాగబాబు నవ్వుకు ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయారనడం లో సందేహం లేదు.
నాగబాబు లేని జబర్దస్త్ ని ఊహించలేం అందంలో అతిశయోక్తి ఉండదు. కొన్ని సార్లు అయన లేకుండా నడిచిన షో లలో ఈ విష్యం స్పష్టం అయింది కూడానూ. తాత్కాలికంగా నాగబాబు లేకపోతేనే ప్రేక్షకులు బోరు ఫీలవడం జరిగేది. ఇప్పుడు ఈ షో నుంచి నాగబాబు బయటకు వెళ్లిపోయారని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. మామూలుగా కాదు.. గత వారం రోజులుగా జబర్దస్త్ కీ నాగబాబుకీ మధ్య దూరం పెరిగిపోయిందని సోషల్ మీడియాలోనూ.. ఇండస్ట్రీ లోనూ విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఇటువంటి ప్రచారాలు గతంలోనూ చాలా జరిగాయి. కానీ, అవేవీ నిజం కాలేదు.
అయితే, ఇప్పుడు ప్రచారం నిజమేనని అనిపించే సంఘటనలు జరుగుతున్నాయి. జీ ఛానెల్ లో ఓ ప్రోమో ఇటీవల విడుదల అయింది. ఆ ఛానెల్ లో ప్రసారం కాబోతున్న కొత్త కార్యక్రమంలో జబర్దస్త్ నాగబాబు ప్రత్యక్షం అయ్యారు. ఈ ప్రోమో చూస్తే ఇటీవల వెల్లువెత్తిన వార్తలు నిజమేనని అనిపిస్తున్నాయి.
ఇక ఎందుకు నాగబాబు తప్పుకుంటున్నారు అనేదానికి చాలా కారణాలు చెబుతున్నారు. కానీ, వాటిలో నిజమెంతో తెలీని పరిస్థితి. ఇదిలా ఉంటే నాగబాబు స్థానంలో న్యాయనిర్ణేతగా వ్యవహరించడానికి ఇప్పటికే ఆలీని మల్లెమాల నుంచి సంప్రదింపులు జరిగాయని తెలుస్తోంది. కానీ, ఆ ఆఫర్ కు ఆలీ తిరస్కరించారని వార్తలు వస్తున్నాయి. తాజాగా బండ్ల గణేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అదే నిజమైతే జబర్దస్త్ కార్యక్రమం లో త్వరలో సరికొత్త జడ్జిమెంట్ వినాల్సి వచ్చేలా ఉంది. ఇక నాగ బాబు తో పాటు చాలా మంది జబర్దస్త్ కి గుడ్ బై చెప్పనున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజా నిజాలు తేలాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే!
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire