Top
logo

'బన్నీ' ఒంటరి వాడయ్యాడా?

Highlights

చాన్నాళ్ళుగా సినీ పరిశ్రమలో మెగాస్టార్ కుటుంబం విషయంలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్ (బన్నీ) కి.....

చాన్నాళ్ళుగా సినీ పరిశ్రమలో మెగాస్టార్ కుటుంబం విషయంలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్ (బన్నీ) కి.. చిరంజీవి కుటుంబానికీ మధ్యలో గ్యాప్ పెరిగిందనేది ఆవార్త. మెగా ఫ్యాన్స్ కూడా రెండు వర్గాలుగా విడిపోయారా అనే ప్రశ్నలూ చాలా సందర్భాల్లో తెరపైకి వచ్చాయి. కారణాలు ఏమైనా కానీ, ఈ వార్తలపై సరైన క్లారిటీ మాత్రం ఇప్పటివరకూ రాలేదు. చిరంజీవి-అల్లు అరవింద్ ఇద్దరిదీ విడదీయలేని బంధం అని అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఈ ఇద్దరి బంధంలోనూ బీటలు వచ్చాయా అనే సందేహాన్ని సినీ ప్రేమికులు వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక చరిత్ర మెగాస్టార్ చిరంజీవిది. ఆయన పేరు చెప్పుకుని తెర మీద వేలగాని ప్రయత్నించిన వారెందరో. అదే విధంగా అయన కుటుంబం నుంచి హీరోలుగా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో కొద్ది మంది ఇప్పటికే తెలుగు తెర మీద పాప్యులర్ అయ్యారు. వారు పాప్యులర్ అవడానికి వారి కృషి కారణం కావచ్చు కానీ, సినిమాల్లోకి రావడానికి మాత్రం చిరంజీవి పేరే కారణం అనేది మర్చిపోలేనిది.

ఇక అసలు విషయానికి వస్తే బన్నీ (అల్లు అర్జున్) రామ్ చరణ్ ఇద్దరూ చిరంజీవి కనుసన్నల్లోనే హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరూ సినిమాల్లో తమను తాము నిరూపించుకోవడమే కాకుండా.. తమకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజిని సొంతం చేసుకున్నారు. రామ్ చరణ్ కంటే ముందే బన్నీ సినిమాల్లోకి వచ్చారు. ఆయన వచ్చిన కొత్తలో ఒక సందర్భంలో రామ్ చరణ్ ను మెగా స్టార్ గా చూడటమే తన లక్ష్యం అని చెప్పారు. చాలా కాలం ఇద్దరి జర్నీ అలాగే నడిచింది. ఒకరితో ఒకరు కలిసి సినిమా ఫంక్షన్లలో కనిపించేవారు. అదే విధంగా రామ్ చరణ్ 'ఎవడు' సినిమాలో అల్లు అర్జున్ కీలక పాత్ర పోషించారు. అటు తరువాత దాదాపుగా స్టోరి మారిపోయింది. ఇప్పుడు వీరిద్దరూ కల్సి సినిమాల్లో కాదు కదా కనీసం మామూలుగా బయట కూడా ఏదైనా ఫంక్షన్లలో కనిపించడం లేదు.

ఇక చాలా సందర్భాలలో పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ కి.. అల్లు అర్జున్ కీ మధ్య వాగ్యుద్ధం జరిగింది. బన్నీ సినిమా వేడుకల్లో మెగా అభిమానులు పవన్ కళ్యాన్ అనుకూలంగా నినదించడం.. పవన్ గురించి మాట్లాడాలని బన్నీ ని డిమాండ్ చేయడం జరిగేది. అయితే, దానికి అల్లు అర్జున్ చెప్పిన సమాధానం వివాదాస్పదమైన నేపధ్యం ఉంది.

ఇక ఇవన్నీ పక్కన పెడితే, తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడు రెండు సినిమాల పేర్లు ప్రముఖంగా చర్చల్లో నిలుస్తున్నాయి. అవి సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరూ', అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో'. ఈ రెండు సినిమాల మధ్య తీవ్రమైన పోటీ వాతావరణం మొదట్నుంచీ నెలకొంది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమాల ప్రీరిలీజ్ ఫంక్షన్ వేడుకలు రెండు రోజుల వ్యవధిలో జరిగాయి. రెండు ఈవెంట్ల మధ్య తేడా ఇప్పుడు బన్నీ కి.. మెగాస్టార్ కుటుంబానికి మధ్య ఎదో తెలీని దూరం పెరిగిన సంకేతాలు ఇస్తోందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

సరిలేరు నీకెవ్వరూ సినిమాకి ముఖ్య అతిధిగా చిరంజీవి హాజరయ్యారు. అయన ఆ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఆ వేదిక మీద మహామహులు కనిపించారు. కానీ, బన్నీ అల వైకుంఠపురం సినిమా ఫంక్షన్ కి ముఖ్య అతిథి అంటూ ఎవరినీ పిలవలేదు (?). సినిమా యూనిట్ తోనే ఫంక్షన్ జరిపించారు. సరిలేరు నీకెవ్వరూ లోని హడావుడి అల వైకుంఠపురములో కనిపించలేదు. అసలు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన బయట వ్యక్తులు (ఈ సినిమా యూనిట్ తప్ప) మరెవరూ అక్కడ కనిపించలేదు.

ఇదీ మామూలుగానే తీసుకున్నా.. బన్నీ మాట్లాడిన మాటల్లో మాత్రం మెగా ఫ్యామిలీకి సంబంధించి అసంతృప్తి వినిపించింది. ఇంత వేడుకలోనూ బన్నీ ఒకే ఒక్కసారి చిరంజీవి పేరు చెప్పారు. నాకెప్పటికీ దేవుడు చిరంజీవి అని చెప్పిన అయన అభిమానులు పవన్ గురించి అడిగేసరికి అయన గొడవ వద్దు అంటూ చిరంజీవి తరువాత నాకు అత్యంత ఇష్టం అయిన వ్యక్తీ రజనీకాంత్ అని చెప్పారు. రజనీ అంటే తనకు చిన్నప్పటినుంచీ పాషన్ అన్నారు. ఆయన అభిమానిని అని సగర్వంగా వేదికమీద ప్రకటించుకున్నారు. అంతకుముందు తన తండ్రే తనకు దైవం అంటూ భావోద్వేగానికీ గురయ్యారు. ఇంతా చేసినా కనీసం.. రామ్ చరణ్ పేరు ఎక్కడా అయన చెప్పలేదు.

మొత్తమ్మీద ఈ అల వైకుంఠపురములో వేడుక మరోసారి మెగా కుటుంబానికీ, బన్నీకీ మధ్య అంతరాన్ని చూపించినట్టయింది. బన్నీ ఒంటరి వాడిన ఫీలింగ్ సినీ అభిమానులకు ముఖ్యంగా మెగా అభిమానులకు కలిగిందని చెప్పొచ్చు.


Web TitleIs Bunny alone from mega family?
Next Story


లైవ్ టీవి