Koratala-Bunny Combination: కొరటాల, అల్లు అర్జున్ : ఇంట్రెస్టింగ్ అప్డేట్!

Koratala-Bunny Combination: టాప్ డైరెక్టర్స్, టాప్ హీరోలు మధ్య సినిమాలు అన్నప్పుడు అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్

Krishna
Published on: 30 July 2020 1:31 PM IST
Koratala-Bunny Combination: కొరటాల, అల్లు అర్జున్ : ఇంట్రెస్టింగ్ అప్డేట్!
X
Koratala siva,Allu arjun( File photo)

Koratala-Bunny Combination: టాప్ డైరెక్టర్స్, టాప్ హీరోలు మధ్య సినిమాలు అన్నప్పుడు అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఓ క్రేజీ కాంబినేషన్ కలిసి పనిచేయనున్నట్లుగా తెలుస్తోంది. అదే కొరటాల శివ, అల్లు అర్జున్ కాంబినేషన్.. ప్రేక్షకుల కూడా ఈ కాంబినేషన్ నుంచి సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య కథ కుదిరిందని తెలుస్తోంది. లాక్ డౌన్ సమయంలో అల్లు అర్జున్ కి కొరటాల ఓ లైన్ వినిపించారట .. ఈ లైన్ బన్నీకి బాగా నచ్చడంతో కొరటాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం..

అయితే ఈ సినిమాలో బన్నీ స్టూడెంట్ లీడర్ గా కనిపించానున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ సినిమా గురించి తాజాగా ఫిలిం సర్కిల్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ విద్యార్థి నాయకుడిగానే కాకుండా యువతను రాజకీయాల్లోకి రమ్మని చెప్పే యువకుడి పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. మెరుగైన సమాజం కోసం యువత రాజకీయాల్లోకి రావాల్సిన కచ్చితంగా ఉందని చెప్పే కథాంశం చుట్టుగా ఈ సినిమా ఉంటుందని సమాచారం.. ఇక కొరటాల శివ సినిమాలు అన్నీ సామజీక అంశాలను స్పృశిస్తూనే కమర్షియల్ ఎలిమెంట్స్ ని కలిగి ఉంటాయి.

ఇక ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇది అల్లు అర్జున్ కి 20 వ సినిమా కాగా సుకుమార్ తో మూడవ సినిమా.. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం కరోనా ప్రభావంతో సినిమా వాయిదా పడింది..

అటు కొరటాల ప్రస్తుతం ప్రస్తుతం చిరంజీవితో 'ఆచార్య' అనే సినిమాను చేస్తున్నాడు. సైరా నరసింహారెడ్డి సినిమా విజయం తరువాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పై నిరంజన్ రెడ్డి, కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గత కొద్ది రోజులుగా శరవేగంగా జరుగుతున్న షూటింగ్ కరోనా వైరస్ ప్రభావం వలన వాయిదా పడింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

Krishna

Krishna

Next Story