Vijay Sethupathi: విజయ్ సేతుపతిని తన్నిన వ్యక్తికి నగదు బహుమతి అంటూ ప్రకటన

*హిందూ మక్కల్ కట్చి అనే సంస్థ విజయ్ సేతుపతిని తన్నిన వారికి 1001 రూపాయల నగదు బహుమతి ఇస్తామని పేర్కొంది

Sandeep Reddy
Published on: 9 Nov 2021 1:38 PM IST
Indu Makkal Katchi  Announced Prize Money For Kicking Vijay Sethupathi
X

విజయ్ సేతుపతిని తన్నిన వ్యక్తికి నగదు బహుమతి అంటూ ప్రకటన

Vijay Sethupathi: బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో తనపై జరిగిన దాడిపై తాజాగా నటుడు విజయ్ సేతుపతి స్పందించాడు. బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో జరిగింది చిన్న ఘటన అని, దాడి చేసిన నా స్నేహితుడితో అంతకు ముందుగానే గొడవ పడ్డాడని, ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన తరువాత అతడు కాస్త మతిస్థిమితం కోల్పోయి అలా దాడి చేశాడని చెప్పుకొచ్చాడు. తనకు సెక్యూరిటీ గార్డ్స్ ని పెట్టుకోవడం ఇష్టముండదని తెలిపిన విజయ్ సేతుపతి తన స్నేహితుడే ఎప్పుడు వెంట ఉంటాడని క్లారిటీ ఇచ్చాడు. ఈ దాడి జరిగినంత మాత్రాన అభిమానులను కలవను అని అనుకోవద్దని, అభిమానులను కలుసుకోవడం తనకి ఎప్పుడు ఇష్టమేనని తెలిపాడు.

ఇదిలా ఉండగా విజయ్ సేతిపతిపై హిందూ మక్కల్ కట్చి అనే సంస్థ ట్విట్టర్ వేదికగా సంచలన ప్రకటన చేసింది. విజయ్ సేతుపతి ఫ్రీడం ఫైటర్ ముత్తు రామలింగయ్య తేవర్ ను, దేశాన్ని అవమానించాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విజయ్ సేతుపతిని తన్నిన వారికి 1001 రూపాయల నగదు బహుమతి ఇస్తామని పేర్కొంది. ఇటీవల బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో తన్నిన వ్యక్తికి కూడా ఈ నగదు బహుమతి అందజేస్తామని, విజయ్ సేతుపతి తను చేసిన తప్పుకు క్షమాపణ చెప్పే వరకు ఎవరు తన్నిన 1001 రూపాయల నగదు బహుమతి అందిస్తామని ఆ సంస్థ తెలిపింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story