Indian Idol 11 winner: ఇండియన్ ఐడల్ 11 విజేత సన్నీ హిందూస్థానీ

K V D Varma
Updated on: 24 Feb 2020 12:06 PM IST
Indian Idol 11 winner: ఇండియన్ ఐడల్ 11 విజేత సన్నీ హిందూస్థానీ
X

ఇండియన్ ఐడల్ 11 విజేతగా షైనీ హిందుస్తానీ నిలిచారు. మూడు నెలలుగా నిర్విరామంగా సాగిన ఇండియన్ ఐడల్ 11 సంగీత కార్యక్రమం ఫైనల్స్ ముగిశాయి. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన ఈ ఇండియన్ ఐడల్ 11 షో విజేతగా నిలవడం సామాన్యమైన విషయం కాదు. విపరీతమైన పోటీ మధ్యలో ఔత్సాహిక గాయకులూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి వస్తుంది.

ఇండియన్ ఐడల్ 11 విజేతగా నిలిచిన షైనీ హిందుస్తానీ పంజాబ్ రాష్ట్రం భటిండా నుంచి ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజేతగా నిలవడం ద్వారా సన్నీ హిందుస్తానీ ఇండియన్ ఇడాల్ 11 ట్రోఫీ తో పాటూ 25 లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నారు.

లీగ్ దశనుంచీ తన సముజ్జీలుగా నిలిచినా అంకోనా ముఖర్జీ, అద్రిం ఘోష్, రిథం కళ్యాన్, రోహిత్ రౌత్ లతో జరిగిన హోరా హరీ ఫినాలే లో సన్నీ తన గాత్రం తో న్యాయనిర్ణేతల తో పాటు కార్యక్రమ వీక్షకుల మన్ననలూ గెలుచుకుని విజేతగా నిలిచారు. ''హల్కా హల్కా సురూర్''.. ''భార డో మేరీ జోడీ'' అంటూ ఫినాలే లో తన గాత్రంతో న్యాయనిర్ణేతలుగా వచ్చిన ఆయుష్మాన్ ఖురానా, నీనా గుప్తాల మనసులు గెలిచారు.

ఇండియన్ ఐడల్ ఆడిషన్స్ జరుగుతున్న సమయంలోనే సన్నీ హిందుస్తానీ తన ప్రతిభతో న్యాయ నిర్ణేతల మనసులు గెలిచారు.ఆడిషన్స్ తరువాత కార్యక్రమం ప్రారంభమైన దగ్గరనుంచీ సన్నీ కోసమే ఇందియంన్ ఐడల్ కార్యక్రమాన్ని తప్పక చూసేలా వీక్షకులకు వీనుల విందైన సంగీతాన్ని అందించారు సన్నీ. ప్రతి రౌండ్ లోనూ తన మీద అందరికీ అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు అందరి అంచనాలను అందుకుంటూ సన్నీ హిందుస్తానీ ఇండియన్ ఐడల్ 11 విజేతగా నిలవడంతో అయన స్వంత రాష్ట్రం పంజాబ్ తో పాటూ దేశవ్యాప్తంగా ఇండియన్ ఐడల్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

K V D Varma

K V D Varma

Next Story