అర్దాంతరంగా ఆగిపోయిన 'భారతీయుడు 2' షూటింగ్

అర్దాంతరంగా ఆగిపోయిన భారతీయుడు 2 షూటింగ్
x
Highlights

ఈ మధ్యనే '2.O' సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న శంకర్ ప్రస్తుతం 'భారతీయుడు 2' సినిమా పైన దృష్టి పెట్టాడు. 1995 లో విడుదలైన 'భారతీయుడు' సినిమాకు...

ఈ మధ్యనే '2.O' సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న శంకర్ ప్రస్తుతం 'భారతీయుడు 2' సినిమా పైన దృష్టి పెట్టాడు. 1995 లో విడుదలైన 'భారతీయుడు' సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ మళ్లీ సేనాపతి పాత్రలో కనిపించనున్నారు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మధ్యనే అధికారికంగా సినిమా ను లాంచ్ చేసిన చిత్ర బృందం మొదటి షెడ్యూల్ షూటింగ్ ను తమిళనాడులోని పొల్లాచి లో మొదలు పెట్టింది. అయితే ఈ షూటింగ్ ప్రస్తుతం లో హోల్డ్ లో పడింది.

సెట్ డిజైన్ లో కొన్ని దర్శకుడు శంకర్ కు నచ్చలేదట. దానివల్ల శంకర్ అనుకున్న మంచి అవుట్ పుట్ రాకపోయేసరికి చేసేదిలేక షూటింగ్ మధ్యలోనే ఆపి వేయాల్సి వచ్చింది. ప్రొడక్షన్ డిజైనర్ ని పిలిపించి సెట్ విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చెబుతున్నాడు శంకర్. ఆ మార్పులు పూర్తవగానే షూటింగ్ మళ్లీ మొదలవనుంది. లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నెడుముడి వేణు ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories