logo
సినిమా

బన్నీ-త్రివిక్రమ్ సినిమాలో ముఖ్యపాత్ర దొరికిందట

Sunil
X
Sunil
Highlights

స్టార్ కమెడియన్లలో ఒకప్పుడు సునీల్ కూడా ఒకడు. అయితే కమెడియన్ గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సునీల్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. మొదట్లో 'మర్యాదరామన్న' లాంటి సినిమాలు బాగానే ఉన్నప్పటికీ, హీరోగా మంచి పేరు తెచ్చుకోలేకపోయాడు సునీల్.

స్టార్ కమెడియన్లలో ఒకప్పుడు సునీల్ కూడా ఒకడు. అయితే కమెడియన్ గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సునీల్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. మొదట్లో 'మర్యాదరామన్న' లాంటి సినిమాలు బాగానే ఉన్నప్పటికీ, హీరోగా మంచి పేరు తెచ్చుకోలేకపోయాడు సునీల్. వరుస డిజాస్టర్ లతో సతమతమైన సునీల్ 'సిల్లీ ఫెలోస్' సినిమా తరువాత తన రూట్ మార్చేశాడు. మళ్ళి కమెడియన్ గా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'అరవింద సమేత' సినిమా తో మళ్లీ కమిడియన్ అవతారం ఎత్తాడు సునీల్.

తరువాత కమెడియన్ గా ఆఫర్లు వస్తున్నాయి కానీ పెద్దగా బ్రేక్ ఇచ్చే పాత్రలేవి సునీల్ కి రావటం లేదు. 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాతో కూడా పెద్దగా మెప్పించలేకపోయిన సునీల్ ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నట్లు స్వయంగా చెప్పాడు. ఈ మధ్యనే మీడియాతో మాట్లాడిన సునీల్, త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాలో తనకు మంచి పాత్ర దక్కిందని చెబుతున్నాడు సునీల్. ఇంతకుముందు 'అరవింద సమేత' సినిమా లో సునీల్ కు అంత పెద్ద పాత్ర దక్కలేదు. మరి కనీసం ఈ సినిమాలోనైనా త్రివిక్రమ్ సునీల్ కోసం ఒక మంచి పాత్ర ఇస్తారో లేదో చూడాలి.

Next Story