Tejaswi Madivada: అతడి వల్లే తాగుడికి అలవాటు పడ్డాను.. ఫుల్లుగా తాగేసి..

అతని వల్లే డిప్రెషన్ కి లోనయ్యాను తాగుడుకి అలవాటు పడ్డాను అంటున్న హీరోయిన్

Arun Chilukuri
Published on: 27 Aug 2022 8:01 PM IST
I got Addicted to Alcohol due to Kaushal Army Says Tejaswi Madivada
X

Tejaswi Madivada: అతడి వల్లే తాగుడికి అలవాటు పడ్డాను.. ఫుల్లుగా తాగేసి..

Tejaswi Madivada: "ఐస్ క్రీమ్", "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" వంటి సినిమాలతో పాపులర్ అయిన తేజస్వి మదివాడ బిగ్ బాస్ సీజన్ 2 లో కనిపించింది కానీ అభిమానుల కంటే నెగిటివిటీని పొగేసుకుంది. తాజాగా దీని గురించి మాట్లాడుతూ, "బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత నెగెటివిటీ చూసి దిమ్మ తిరిగిపోయింది సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే బిగ్ బాస్ కౌశల్ మండా ఆర్మీ అనేది వేరే లెవెల్ ఆఫ్ ఎటాక్ గా ఫీలయ్యాను. ఒక అమ్మాయిని మీమ్స్ తో అంతలా ఎటాక్ చేయడం వల్ల వాళ్లకి ఏం ఉపయోగం లేదు. వాడెవడో లైఫ్ లో ముందుకు వెళ్లడానికి ఏదైనా చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడా కనిపించడం లేదు. కానీ అది జరిగినప్పుడు నేను చాలా డిప్రెస్ అయ్యాను. ఎంతగా అంటే అసలు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను," అని చెప్పుకొచ్చింది తేజస్వి.

"దాదాపు రెండున్నర ఏళ్ల పాటు ఇండియాకి రాకుండా బయట తిరుగుతున్నాను. బిగ్ బాస్ నుంచి నేను చాలా హ్యాపీగానే బయటకు వచ్చాను కానీ ఏదో తప్పు జరిగిపోయినట్టు నా ఫ్రెండ్స్ అంతా నన్ను పట్టుకుని ఏడ్చారు. ఏంటి అని చూస్తే నా మీద రకరకాల బూతులు. దానికి తోడు నాని కూడా నా నోటికి హద్దు అదుపు లేదని తిట్టటం ఇలా నాకు నాని మరియు బిగ్ బాస్ షో పై చిరాకు వచ్చింది. హౌస్ నుంచి వచ్చాక కౌశల్ ఆర్మీ కారణంగా వ్యక్తిగత మరియు వృత్తి జీవితంపై నియంత్రణ కోల్పోయాను. అందువల్లే డిప్రెషన్ కు లోనయ్యాను. తాగుడుకి అలవాటు పడ్డాను. అందుకే కమిట్మెంట్ సినిమాలో నా లుక్ బాగాలేదు," అని చెప్పింది తేజస్వి. "ఫుల్లుగా తాగేసి చాలా లావైపోయాను. ఆ బాధలను తీర్చుకోవడానికి నేను తాగుడికి అలవాటు పడాల్సి వచ్చింది," అని అంటోంది తేజస్వి మదివాడ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story