Jabardasth: షో కి వచ్చిన కలెక్షన్ మన ఎలివేషన్ కే సరిపోతోందట 'జబర్దస్త్' పై ఆది పవర్ పంచ్!

Jabardasth: షో కి వచ్చిన కలెక్షన్ మన ఎలివేషన్ కే సరిపోతోందట జబర్దస్త్ పై ఆది పవర్ పంచ్!
x
Highlights

నిన్ను చూస్తె కోడి పుంజే ఆగటంలేదు పకోడీ గాల్లం మేమెంత? అనసూయ కు ఆది హాట్ పంచ్.. వేసేశాడు. దానికి సిగ్గుపడటం తప్ప మరేం చేయలేక చూస్తుండిపోయింది ఇదంతా...

నిన్ను చూస్తె కోడి పుంజే ఆగటంలేదు పకోడీ గాల్లం మేమెంత? అనసూయ కు ఆది హాట్ పంచ్.. వేసేశాడు. దానికి సిగ్గుపడటం తప్ప మరేం చేయలేక చూస్తుండిపోయింది ఇదంతా లేటెస్ట్ జబర్దస్త్ ప్రోమోలో సన్నివేశం. జబర్దస్త్ అంటే ముందు చెప్పుకోవాల్సింది హైపర్ ఆది గురించే కదా. స్టేజి మీద అడుగుపెట్టింది మొదలు.. తన స్కిట్ పూర్తయ్యే వరకూ ఆది వేసే పంచ్ లకు పోత్తచేక్కలవ్వాల్సిందే! తన స్కిట్ లలో ఇదీ అదీ అని లేదు అన్ని కోణాల్లోనూ పంచ డైలాగులు వేసి నవ్వించేస్తాడు ఆది.

గురువారం ప్రసారమైన స్కిట్ లో ఎమ్మెల్యే రోజాను కుర్చీలో కట్టేసి తన పంచ్ లతో ఆదేసుకున్నాడు ఆది. ఇప్పుడు వచ్చే వారం ప్రసారమయ్యే స్కిట్ ప్రోమో విడుదల చేశారు. దాన్లో ఆది అల వైకుంఠపురములో అల్లు అర్జున్ గెటప్ తో ఎంట్రీ ఇచ్చాడు ఆది. కోడి పుంజును పట్టుకుని..చేతిలో కొడవలితో..నోటిలో బీడీతో ఆది వస్తుంటే ఫైర్ వర్క్స్ వచ్చాయి. అది చూసి రోజా ఆది ఎంట్రీ అదిరింది అన్నారు. దానికి ఆది ''షో కి వచ్చిన కలెక్షన్ మన ఎలివేషన్ కే సరిపోతోందట'' అంటూ జబర్దస్త్ నిర్మాతలకే పంచ్ వేశాడు. ఇక వెంటనే మనుషులకే కాదు కోళ్ళకి కూడా పార్షియాలిటీ ఉంటుందండీ.. ఇదిగో ఈ కోడి చూడండి నేను అల్లు అర్జున్ కాదు ఆది అని తెలిసిపోయినట్టుంది ఊరికే కిందికి జారిపోతోంది అంటూ డైలాగ్ వేశాడు ఆది. తరువాత అలానే అనసూయ దగ్గరకి వెళ్లి పంచ్ వేశాడు.

హైపర్అ ఆది తో మొదలైన నవ్వుల వానను మిగతా వారూ బాగానే కంటిన్యూ చేసినట్టు దిరే అభిని నవీన్ అడుగుతాడు.. అయ్యగారు సాంకేతిక లోపం అంటే ఏమిటి? అని. దానికి అభి..భార్య ఇంట్లో ఉన్నపుడు భర్త మాటలు వచ్చినా కూడా మూగోడిలా ఉంటాడు చూడు అది. అంటూ జవాబిస్తాడు.ఇక రాఘవ ''ఇన్నాళ్ళూ నా యవ్వనాన్ని తాబేలులా తొంగోపెట్టాను. ఇక చూస్కో అంటూ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. దానికి వెంటనే రోజా ముసలోడికి దసరా పండగ అంటూ పంచ్ వేసి గాలితీసేశారు. రాఘవ భార్య మీ కళ్ళల్లో కసి చూస్తుంటే ఈరోజు రాత్రి నన్ను మసి చేసేటట్టు ఉన్నారు అంటుంది. దానికి కూడా రోజా ఆల్రెడీ నువ్వు మసిలానే ఉన్నావు..ఇంకా మసి చేయడం ఏమిటి అన్నారు. అంతే.. రాఘవ మళ్ళీ ఇంకో దెబ్బ పడింది అని మూతి తిప్పాడు.

మొత్తమ్మీద వచ్చే గురువారం ఫిబ్రవరి 6 వ తేదీన ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్ నవ్వుల జడివాన కురిపించేతట్టే కనిపిస్తోంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories