Hyper Aadi Marriage: ప్రముఖ యాంకర్‌తో హైపర్‌ ఆది పెళ్లి..?

Hyper Aadi: ఛాన్స్ దొరికిందా ఇక అంతే.. పంచ్ డైలాగులతో విరుచుకుపడిపోవడంలో దిట్ట జబర్దస్త్ హైపర్ ఆది.

Arun Chilukuri
Published on: 31 July 2023 12:43 PM IST
Hyper Aadi is Going to Marry an Anchor
X

Hyper Aadi Marriage: ప్రముఖ యాంకర్‌తో హైపర్‌ ఆది పెళ్లి..?

Hyper Aadi: ఛాన్స్ దొరికిందా ఇక అంతే.. పంచ్ డైలాగులతో విరుచుకుపడిపోవడంలో దిట్ట జబర్దస్త్ హైపర్ ఆది. బుల్లితెర కామెడీ షోల్లో ఆది వేసే పంచులు, సెటైర్లకు చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ప్రస్తుతం బుల్లితెరపై అతనిదే హవా. పలు టీవీ షోలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్‌. ఇక కేవలం బుల్లితెరపైనే కాకుండా సిల్వర్‌ స్క్రీన్‌ పైనా మెరుస్తున్నాడు ఆది. సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలేసి తనకున్న ఆ మాటలు విసిరే బలంతోనే జబరదస్త్ షో కి వచ్చి అక్కడ ఆది లేకపోతే ఎలా అనేంతగా పాతుకుపోయాడు.

ఇప్పుడు సినిమాల్లోనూ వరుసగా నటిస్తూ బిజీ బిజేగా ఉన్నాడు హైపర్ ఆది. తాజాగా అతడు పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అవ్వాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం ఊపందుకుంది. దీంతో అతడికి కాబోయే భార్య ఎవరా? అని అభిమానులు కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. హైపర్ ఆది.. ఒక యాంకర్ ప్రేమలో ఉన్నాడని టాక్ నడుస్తోంది. ఆది కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఆమె చాలా సపోర్ట్ గా నిలిచింది అంట. మొదట స్నేహితులుగా ఉన్న ఈ జంట కొద్దిరోజులకే ప్రేమలో పడ్డారట. అయితే కెరీర్ సెట్ అయ్యేవరకు ఇంట్లో చెప్పకూడదని అనుకుని.. ఈ మధ్యనే ఇరు కుటుంబాలకు చెప్పారట. తాజాగా వీరి ప్రేమ గురించి ఇంట్లో తెలిపితే ఇద్దరి పెద్దలు కూడా అంగీకరించారట. ఇంకేముంది త్వరలోనే ఒక మంచి ముహూర్తం ఏర్పాటు చేసి ఆ అమ్మాయితో నిశ్చితార్థం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. త్వరలో ఆ ఆమ్మాయి పేరుతో పాటు.. పెళ్లి విషయాన్ని అధికారికంగా ఆదినే వెల్లడించాలనే ప్లాన్‌లో ఉన్నారట.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story