Top
logo

'అనసూయ' తో 'హైపర్ ఆది'ల రొమాన్స్ 'జబర్దస్త్' దాటి సారధీలో 'పండగ' చేసుకుంది!

అనసూయ తో హైపర్ ఆదిల  రొమాన్స్ జబర్దస్త్ దాటి సారధీలో పండగ చేసుకుంది!
X
Highlights

టీవీలో రొమాంటిక్ పెయిర్ ఎవరంటే కచ్చితంగా సుడిగాలి సుధీర్.. రష్మీ గౌతమ్ అని చెప్పేశేవారు ఇప్పటిదాకా. జబర్దస్త్...

టీవీలో రొమాంటిక్ పెయిర్ ఎవరంటే కచ్చితంగా సుడిగాలి సుధీర్.. రష్మీ గౌతమ్ అని చెప్పేశేవారు ఇప్పటిదాకా. జబర్దస్త్ తో పాటు తాము ఉన్న ఇతర షోలను సక్సెస్ చేసుకోవడానికి తమ స్కిట్ లకు ప్రత్యేకంగా రొమాంటిక్ టచ్ ఇచ్చే పని సుడిగాలి సుధీర్ టీమ్ చేస్తూ వస్తారు. ఇది చాలా కాలంగా కొనసాగుతోంది. ఇది ఎంత సక్సెస్ అయిందంటే, సుధీర్ కు రష్మీ కి ఎదో ఉందని గాసిప్స్ ఒక దశలో నెట్ ను షేక్ చేశాయి. తరువాత కొంత కాలంగా ఆ ఏరకమైన మాటలు ఆగిపోయినా, రష్మీ-సుధీర్ ఉన్న షోలో తప్పనిసరిగా వారిద్దరి మధ్య నడిచే సంభాషణలు, సన్నివేశాల్లో రొమాన్స్ మోతాదు కాస్త ఎక్కువే ఉండేలా చూస్తుంటారు నిర్వాహకులు.

సరే, ఇదంతా పక్కన పెడితే, కొత్తగా మరో జంట ఇటువంటి ప్రయత్నాలతో వీక్షకుల దృష్టిని తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. గత కొద్దికాలంగా వీరిరువురి మధ్య షోల్లో రొమాంటిక్ సంభాషణలు నడిచి వీక్షకులకు కిక్ ఇస్తున్నాయి. ఈపాటికే వారెవరో అర్ధం అయిపోయి ఉంటుంది. అవును వాళ్లిద్దరూ.. అనసూయ భరద్వాజ్..హైపర్ అది! తన పంచ్ టైమింగ్ తో జబర్దస్త్ రేంజ్ ని పెంచేసిన కమెడియన్ ఆది. తన స్కిట్ ఒక్కటే జబర్దస్త్ ఎపిసోడ్ మొత్తానికి వచ్చే వీక్షణాల్ని యూట్యూబ్ లో సాధించేస్తుంది. ఆది కనిపిస్తే చాలు ఎటువంటి పంచ్ లు వస్తాయో అని అందరూ ఎదురు చూస్తారు. ఇక జబర్దస్త్ లో అనసూయ యాంకరింగ్ కి ఫిదా కానివారుండరు. ఆమె డ్రస్సులు.. మాటలు.. అందంగా చేసే డ్యాన్స్ అన్నీ జబర్దస్త్ కి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. ఇక ఆది స్కిట్ మొదలైందంటే చాలు ..అనసూయ మీద ఆది వేసే పంచ్ కోసం వీక్షకులు చూస్తారు. ఆ పంచ్ కి సిగ్గుపడుతూ అనసూయ ఐసీసీ రియాక్షన్ కూడా ఎప్పుడూ హిట్టే!


తాజాగా ఆ పంచ్ లలో రొమాంటిక్ డోస్ పెరిగిపోయింది. మొన్నటికి మొన్న వచ్చిన జబర్దస్త్ ఎపిసోడ్లో ఆదిని అనసూయ బావా అంటూ వయ్యారంగా పిలవడం ఇంకా జబర్దస్త్ ప్రేక్షకుల మదిని దాటి పోలేదు. ఇప్పుడు జబర్దస్త్ కాకుండా కూడా ఇతర షో లలోనూ అనసూయ..హైపర్ ఆదిలా మధ్య రొమాన్స్ ని చూపిస్తూ ప్రోమోలను వదిలే ట్రెండ్ స్టార్ట్ చేసింది ఈటీవీ. అందులో భాగంగా త్వరలో ప్రారంభం కాబోతున్న ప్రతిరోజూ పండగే షో ప్రోమో ఒకటి ఇప్పుడు నెట్టింట విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ షో కి అనసూయ యాంకర్. ఈ షో మహిళల కోసమే ప్రారంభం కాబోతోంది.


దీని ప్రమోషన్ కి అనసూయ, ఆది ల మధ్య రొమాంటిక్ డైలాగుణాల్ని వాడుకున్నారు. ఎర్ర గులాబీ పట్టుకుని ఆది అనసూయ వెనుక పడతాడు. 'హాయ్.. ఆది!! నువ్ ఏంటి ఇక్కడ'' అని అనసూయ సిగ్గులు ఒలకబోసేసింది. దానికి 'నువ్విక్కడుండీ.. నేను అక్కడ ఉంటే ప్రాణం విలవిలా' అంటూ పాటేసుకుని మరీ పువ్వు ఇచ్చాడు ఆది. ''ఇది జబర్దస్త్ కాదు.. సారధి స్టుడియో''అని అనసూయ ఆదిని ఆడుకుందామని చొసింది. దానికి ఆది వెంట నే, ''అంటే.. ఇకనుంచి మన ప్రేమకు వారధి సారధి'' అంటూ పంచ్ తో జనాల్ని అదరగొట్టాడు హైపర్ ఆది. ఆడవాళ్ల షోలో నీకేం పని అని కంటెస్టెంట్ ఒకరు అడగ్గా.. 'మీ ఆట మీరు ఆడుకోండి.. నేను అనసూయ మనసు దోచుకోవడానికి వచ్చా' అంటూ రొమాంటిక్ పంచ్ వదిలాడు ఆది. ఇలా ప్రోమోలో కూడా వీరిద్దరి మధ్య నడిచిన రొమాన్స్ వీక్షకులను ఆకట్టుకొంటోంది.

అన్నట్టు ఈ ప్రతిరోజూ పండగే షో సోమవారం నుంచి శనివారం వరకూ మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం చేయడానికి సన్నాహాలు చేస్తోంది ఈటీవీ. సెలబ్రిటీలకు.. కామన్ మహిళలకూ మధ్య జరిగే పోటీ ఇది అని అనసూయ ప్రోమోలో చెబుతోంది. మరి ఆది చేసిన ఈ హైపర్ ప్రోమో ఈ షోకు ఎంత హైప్ తీసుకువస్తుందో!

Web Titlehyper Aadi Anasuya romantic promo for Prathi Roju Pandage
Next Story