Jr NTR Car: ట్రాఫిక్ పోలీసుల చేతికి చిక్కిన ఎన్.టీ.ఆర్ కార్

Jr NTR Car: చెక్ పోస్ట్ వద్ద ఎన్టీఆర్ కారు నిలిపివేసిన హైదరాబాద్ పోలీసులు

Rama Rao
Updated on: 22 March 2022 11:07 AM IST
Hyderabad Police Stopped an NTR Car at a Check Post
X

Jr NTR Car: ట్రాఫిక్ పోలీసుల చేతికి చిక్కిన ఎన్.టీ.ఆర్ కార్

Jr NTR Car: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు టింటెడ్ గ్లాస్ వేయించుకున్న వారు మరియు నంబర్ ప్లేట్లు సరిగ్గా లేని వాళ్ల ను పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రూల్స్ కి విరుద్ధంగా నంబర్ ప్లేట్ లో పైన ఫ్యాన్సీ నెంబర్లు వేయించుకోవడం కార్ లోపల కనిపించకుండా విండో లకు టింట్ వేయించటం వంటివి చేసినవారి వాహనాలను నిలిపివేసి వారికి తగిన జరిమానా విధిస్తున్నారు. అయితే తాజాగా ఈ నేపథ్యంలో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కార్ ను నిలిపివేశారు ట్రాఫిక్ పోలీసులు.

కార్ విండో లకు ఉన్న టింట్ లను తీయించేసినట్లు తెలుస్తోంది. అయితే కారుని ఆపినప్పుడు అందులో జూనియర్ ఎన్టీఆర్ తనయుడు కార్ డ్రైవర్ తో పాటు ఇంకా మరొకరు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే టింట్ ను తీసేశాక వాహనాన్ని మళ్ళీ జాగ్రత్తగా తిరిగి పంపించినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ముత్తు ఈ డ్రైవ్ ను నిర్వహించారు.

జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద చాలా కార్లను నిలిపి దాదాపుగా 90 మంది వాహనదారులపై కేసు నమోదు చేశారు. ఇక వాహన లకు నెంబర్ ప్లేట్ లేని వాళ్ళ పై కూడా తగిన జరిమానా విధించారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ కి సంబంధించిన కొందరు పొలిటిషన్ లో కార్లు కూడా కనిపించినట్లు సమాచారం.

Rama Rao

Rama Rao

Next Story