రౌడీ బాయ్ తో సినిమా తీస్తా అంటున్న యువ దర్శకుడు

Ruthvik
Published on: 5 Feb 2019 11:43 AM IST
రౌడీ బాయ్ తో సినిమా తీస్తా అంటున్న యువ దర్శకుడు
X

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద పెద్ద వసూళ్లను సాధించిన సినిమా 'హుషారు'. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను నమోదు చేసుకుంది. బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమాకు కొత్త దర్శకుడు శ్రీ హర్ష దర్శకత్వం వహించాడు. దాదాపు అందరూ కొత్తవాళ్లతో తీసిన ఈ సినిమా విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రెస్ మీట్ లో పాల్గొంది.

మీడియాతో ముచ్చటిస్తూ శ్రీ హర్ష తన తదుపరి ప్రాజెక్టు పై క్లారిటీ ఇచ్చాడు. తను తదుపరి సినిమా హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ తో చేయబోతున్నాను అని చెప్పాడు. పూర్తి వివరాలు బయట పెట్టకపోయినా విజయ్ దేవరకొండ తో మాత్రం ఒక సినిమా ఉండబోతోందని చెప్పాడు శ్రీ హర్ష. అంతేకాక తమిళం మరియు హిందీ రీమేక్ లకు కూడా తననే దర్శకత్వం వహించమని అడిగారని కానీ తనకు మాత్రం డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలని ఉందని తెలిపాడు. ఇక విజయ్ దేవరకొండతో శ్రీహర్ష తీసే సినిమా ఎలా ఉండబోతోందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Ruthvik

Ruthvik

Next Story