logo
సినిమా

'మజిలీ' సినిమా రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ టీవీ ఛానల్

మజిలీ సినిమా రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ టీవీ ఛానల్
X
Highlights

పెళ్లయిన తర్వాత సమంతా, నాగచైతన్య కలిసి నటిస్తున్న మొదటి చిత్రం కావడంతో 'మజిలీ' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న...

పెళ్లయిన తర్వాత సమంతా, నాగచైతన్య కలిసి నటిస్తున్న మొదటి చిత్రం కావడంతో 'మజిలీ' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. 'నిన్ను కోరి' ఫేమ్ శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోందట. ప్రముఖ టీవీ ఛానల్ జీ టీవీ ఈ సినిమా డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం జీటీవీ దాదాపుగా ఆరు కోట్లు వెచ్చించినట్టు సమాచారం. ఇక ఈ సినిమా 90స్ బ్యాక్ డ్రాప్ తో సాగుతుందని సమాచారం.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతూ ఉంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే సమంత నాగచైతన్య కలిసి నటించిన 'ఏ మాయ చేసావే, 'ఆటోనగర్ సూర్య' మరియు 'మనం' సినిమాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కూడా అంతకంటే పెద్ద హిట్ అవుతుందని అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా కాకుండా నాగచైతన్యకు 'వెంకీ మామ' మరియు సమంతకు '96' రీమేక్ ఉన్న సంగతి తెలిసిందే.

Next Story