Sushant Dil Bechara Movie : సుశాంత్ చివరి చిత్రానికి విదేశాల్లో భారీ రెస్పాన్స్!

Sushant Dil Bechara Movie : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరగా నటించిన చిత్రం 'దిల్ బేచారా'.. ఇందులో సుశాంత్ సరసన

Krishna
Published on: 8 Sept 2020 3:35 PM IST
Sushant Dil Bechara Movie : సుశాంత్ చివరి చిత్రానికి విదేశాల్లో భారీ రెస్పాన్స్!
X

Dil Bechara

Sushant Dil Bechara Movie : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరగా నటించిన చిత్రం 'దిల్ బేచారా'.. ఇందులో సుశాంత్ సరసన సంజనా సంఘీ హీరోయిన్ గా నటించింది. సైఫ్‌ అలీ ఖాన్‌, షాహిల్‌ కీ రోల్ పోషించారు. ఈ సినిమాకి ముఖేశ్‌ చబ్రా దర్శకత్వం వహించగా, ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందించారు. కరోనా టైంలో ధియేటర్ లు మూతపడడంతో సినిమాని ఓటీటీ వేదికగా రిలీజ్ చేశారు.. సుశాంత్ చివరి చిత్రం కావడంతో ప్రేక్షకులకు ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించారు మేకర్స్..

అయితే ఈ సినిమాకి విదేశాల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. న్యూజిల్యాండ్‌, ఫిజిలో థియేటర్లు నడుస్తుండటంతో నిర్మాతలు అక్కడ సినిమాని విడుదల చేశారు. అక్కడ ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. హాలీవుడ్‌ దర్శకుడు క్రిస్టోఫర్‌ నొలన్‌ తీసిన 'టెనెంట్‌'కి పోటీగా నిలిచి వసూళ్లు సాధించిందని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.. న్యూజిల్యాండ్‌లో ఈ చిత్రం 48,436 డాలర్లు, ఫిజిలో 33,864 డాలర్లు సాధించినట్లుగా వెల్లడించారు. ఇక జాన్‌ గ్రీన్‌ 'ది ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌ అనే నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు.

అటు సుశాంత్ జూన్ నెల 14న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిన సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా ముంబై పోలీసులు నిర్ధారించారు.. అయితే అనే అతను ఆత్మహత్యను ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఫ్యూచర్ స్టార్ గా మంచి భవిష్యత్ ఉన్న సుశాంత్ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం అందరినీ కలవరపరిచింది. ప్రస్తుతం ఈ కేసు సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతోంది.

Krishna

Krishna

Next Story