నితిన్ సినిమా.. తమన్నాకి భారీ రెమ్యున‌రేష‌న్?

Andhadhun Remake : ఈ ఏడాది భీష్మ సినిమాతో అకట్టుకున్నాడు యంగ్ హీరో నితిన్.. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ హిట్

Krishna
Published on: 20 Sept 2020 6:51 PM IST
నితిన్ సినిమా.. తమన్నాకి భారీ రెమ్యున‌రేష‌న్?
X

Nithiin, Tamannah Bhatia

Andhadhun Remake : ఈ ఏడాది భీష్మ సినిమాతో అకట్టుకున్నాడు యంగ్ హీరో నితిన్.. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ హిట్ అయింది. ఇక ప్రస్తుతం నితిన్ బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 'అంధాదున్' సినిమాను రిమేక్ చేస్తున్నాడు.. ఒరిజినల్ లో ఆయుష్మాన్‌ ఖురానా పోషించిన పాత్రను తెలుగులో నితిన్ చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నితిన్ సొంతగా నిర్మిస్తున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు జ‌ర‌గుతున్నాయి.

అయితే తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రల కోసం ఇద్దరు కథానాయకలను ఎంపిక చేసింది చిత్రబృందం.. ఇందులో ఒకరు నితిన్‌కు జోడీగా నభా నటేష్ ని ఫిక్స్ చేయగా, సీనియర్ హీరోయిన్ టబు పాత్ర కోసం మిల్కీ బ్యూటీ తమన్నాని ఎంపిక చేశారు మేకర్స్. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్ర కోసం తమన్నాకి భారీగానే ఆఫర్ చేశారట మేకర్స్.. ఈ పాత్ర కోసం తమన్నాకి ఏకంగా కోటిన్నర రెమ్యున‌రేష‌న్ ముట్టినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం తమన్నా నటించిన `దటీజ్ మహాలక్ష్మి` రిలీజ్ కావాల్సి ఉండగా... సత్యదేవ్ సరసన మరో సినిమాలో నటిస్తోంది.

ఇక ఇప్పటికే 'అంధాదున్' రీమేక్ ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైంది.. సినిమా రెగ్యులర్ షూటింగ్ ని నవంబర్‌లో మొదలుకానుంది.. ఇక ఈ సినిమా తర్వాత నితిన్ విభిన్నమైన కథలను తెరకెక్కించే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమాని, కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు పిక్స్ అయ్యాడు నితిన్.. ఈ సినిమాలు వచ్చే సంవత్సరంలోనే విడుదల చేయనున్నారు.

Krishna

Krishna

Next Story