Top
logo

నితిన్ 'రంగ్ దే' కి భారీ డీల్.. అయినప్పటికీ నో?

నితిన్ రంగ్ దే కి భారీ డీల్.. అయినప్పటికీ నో?
X

rang de movie

Highlights

Nithin Rang De : ఈ ఏడాది భీష్మ సినిమాతో భారీ హిట్ కొట్టాడు యంగ్ హీరో నితిన్... దీనితో మళ్లీ ఫామ్ లోకి వచ్చి వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు నితిన్.

Nithin Rang De : ఈ ఏడాది భీష్మ సినిమాతో భారీ హిట్ కొట్టాడు యంగ్ హీరో నితిన్... దీనితో మళ్లీ ఫామ్ లోకి వచ్చి వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు నితిన్.. అందులో భాగంగానే సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో రంగ్ దే అనే చిత్రం తెరకెక్కతుంది. ఇందులో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది... తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకప్ భావిస్తున్నారు..

అయితే ఈ సినిమాకి ఓ ప్రముఖ డిజిటల్ సంస్థ ఓటీటీ లో రిలీజ్ చేసేందుకు 35 కోట్లు ఆఫర్ చేసిందని సమాచారం.. అందుకు సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నో చెప్పినట్టుగా తెలుస్తోంది.. ఎందుకంటే ముందునుంచి ఈ సినిమాని థియేటర్ లొనే రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.. ఒకవేళ సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తే థియేటర్ కింద 20, నాన్ థియేటర్ (డిజిటల్, శాటిలైట్, అదర్ లాంగ్వేజెస్, హిందీ డబ్బింగ్ అన్నింటి మీదా మరో ఇరవై) వస్తాయి అన్నట్టుగా ప్లాన్ లో ఉందట.. సినిమా హిట్ అయితే లాభాలు వచ్చే ఛాన్స్ కూడా ఉంది.

ఇక ఈ సినిమాకి ఓ నెల రోజల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ మాత్రమే ఉంది.. ఈ షూటింగ్ ని చకచక కంప్లీట్ చేసి సంక్రాంతి వార్ లో ఉంచాలని చూస్తున్నారు.. నితిన్ కి ఇది 29 వ చిత్రం కావడం విశేషం.. తాజాగా ఈ ఏడాది భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన చాలా అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాతో పాటుగా గాంధీ మెర్లపాక దర్శకత్వంలో అందుధాన్ రీమెక్, విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో, కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమాని లైన్ లో పెట్టాడు నితిన్.

Web TitleHuge demand for hero nithin rang de movie for releasing in ott platform
Next Story