Kangana Sarees : ముంబైలో కంగనా చీరలకి యమ క్రేజ్

Kangana Sarees : బాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ హాట్ టాపిక్ కంగనా రనౌత్.. సుశాంత్ ఆత్మహత్య తర్వాత మహారాష్ట్ర సర్కార్ పై, ముంబై పోలిసుల

Krishna
Published on: 13 Sept 2020 4:02 PM IST
Kangana Sarees : ముంబైలో కంగనా చీరలకి యమ క్రేజ్
X

 kangana ranaut sarees in mumbai 

Kangana Sarees : బాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ హాట్ టాపిక్ కంగనా రనౌత్.. సుశాంత్ ఆత్మహత్య తర్వాత మహారాష్ట్ర సర్కార్ పై, ముంబై పోలిసుల పైన కీలక వాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తోంది కంగనా. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కంగనాకి మరింతగా క్రేజ్ పెరిగిపోయింది. అయితే ఆమెకి ఉన్న క్రేజ్ ని కొందరు వ్యాపారస్తులు క్యాష్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే గుజరాత్ లోని సూరత్ వస్త్ర వ్యాపారులు కంగనా చీరల పేరుతో మార్కెట్ లోకి వదిలారు.. ఆ చీరలపై మణికర్ణిక సినిమాలోని కంగన ఫోటోను ముద్రించారు.

అంతేకాకుండా కంగనా రనౌత్ బ్యాక్ గ్రౌండ్‌లో వినాయకుడి బొమ్మను ముద్రించారు. ఇక ఐ సపోర్ట్ కంగనా అనే పెయింట్ కూడా వేశారు. ఇప్పుడు ఈ చీరలకి మంచి క్రేజ్ వస్తోంది. ఈ చీరలను కొనేందుకు మహిళలు కూడా ఎగబడుతున్నారు. గతంలో నరేంద్ర మోదీ, ప్రియాంకా చోప్రా, స్వచ్ఛభారత్, కరోనా జాగృతి అభియాన్ పేరుతో కూడా చీరలు ప్రింట్ చేసి మార్కెట్ లోకి వదిలారు.

ఇక మహారాష్ట్రలో కంగనా హాట్ టాపిక్ గా మారిపోయింది. మహారాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ కంగనా అన్నట్టుగా అక్కడి పరిస్థితి నెలకొంది. తాజాగా ముంబైలోని ఆమె కార్యాలయాన్ని బిఎంసీ అధికారులు చట్ట విరుద్దంగా ఉందంటూ కూల్చివేసే ప్రయత్నం చేశారు. దీంతో ముంబై హైకోర్టు కంగనా ఆఫీసును కూల్చొదంటూ స్టే విధించింది. ఈ క్రమంలో మహారాష్ట్రలో పరిస్థితి ఒక్కసారిగా కంగానా వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వంగా మారిపోయింది. సీఎం ఉద్ధవ్ థాక్రేను ఉద్దేశించి పలు కామెంట్స్ కూడా చేసింది కంగనా.. మీ అహంకారం తొలిగిపోయే రోజు వస్తుంది అంటూ విరుచుకుపడింది.

Krishna

Krishna

Next Story