Vikram Vedha Remake: బాలీవుడ్ లో "విక్రమ్ వేదా" రీమేక్

Vikram Vedha Remake: "విక్రమ్ వేదా" 2017 తమిళంలో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో తమిళ

Sandeep Reddy
Published on: 10 July 2021 3:07 PM IST
Hrithik Roshan And Saif Ali Khan in Vikram Vedha Movie Remake in Bollywood
X

హ్రితిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ (ఫైల్ ఫోటో)

Vikram Vedha Remake: "విక్రమ్ వేదా" 2017 తమిళంలో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో తమిళ సినీ రంగంలో సునామి సృష్టించింది. మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా నటించిన ఈ చిత్రానికి పుష్కర్- గాయత్రీ దర్శకత్వం వహించారు. తాజా ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు. హ్రితిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హిందీలో కూడా పుష్కర్- గాయత్రీలే దర్శకులుగా ఉండబోతున్నారు. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రాబోతున్న ఈ చిత్రాన్ని నిరాజ్ పాండే భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ మరోపక్క "ఆదిపురుష్" చిత్రంతో పాటు "భూత్ పోలీస్" చిత్రాలలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇక హ్రితిక్ రోషన్ గతంలో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో "వార్" చిత్రం తర్వాత మళ్ళీ తాజాగా హ్రితిక్ - దీపిక పదుకునే జంటగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఫైటర్ చిత్ర సినిమా షూటింగ్ ని ముగించుకొని త్వరలో ప్రేక్షుకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ నటులు దక్షిణాది చిత్రాలపై ఫోకస్ చేస్తుండగా దక్షిణాది సినిమా నటులు మాత్రం బాలీవుడ్ చిత్రాల్లో ఎంట్రీ ఇస్తూ పాన్ ఇండియా స్థాయి సినిమాల్లో నటిస్తూ నటులుగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. "విక్రమ్ వేదా" సినిమా రీమేక్ తో పుష్కర్-గాయత్రీ దంపతులు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అతి త్వరలో షూటింగ్ మొదలుపెట్టనున్న ఈ చిత్ర యూనిట్ వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు సమాచారం.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story