Coronavirus Infect To Director Rajamouli's Family: రాజమౌళి ఫ్యామిలీకి కరోనా ఇలా సోకిందట..

Coronavirus Infect To Director Rajamouli's Family: దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే...

Krishna
Published on: 1 Aug 2020 1:05 PM IST
Coronavirus Infect To Director Rajamoulis Family: రాజమౌళి ఫ్యామిలీకి కరోనా ఇలా సోకిందట..
X
Rajamouli (File Photo)

Coronavirus Infect To Director Rajamouli's Family: దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే... సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరికి సోకుతూ ప్రజలను మరింతగా భయబ్రాంతులకు గురిచేస్తోంది కరోనా. అయితే ఇందులో ఎక్కువగా సినీ ఇండస్ట్రీకి చెందినవారు ఎక్కువగా ఉండడం ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే చాలా మంది సినిమా ఇండస్ట్రీకి చెందినవారు కరోనా బారిన పడ్డారు. తాజాగా టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి కూడా కరోనా బారిన పడ్డారు.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

అయితే కరోనా పైన ముందునుంచి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న రాజమౌళి ఫ్యామిలీకి కరోనా ఎలా సోకింది అన్నది అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రాజ‌మౌళిది మొద‌టి నుంచీ ఉమ్మడి కుటుంబం. అంద‌రూ క‌లిసి ఒకే అపార్ట్‌మెంట్‌లో వివిధ ఫ్లాట్స్‌లో నివ‌సిస్తూంటారు.షూటింగ్స్‌ లేని సమయాల్లో వీరందరూ కలుసుకోవడం, గెట్‌టుగెదర్‌లా కలుసుకోవడం జరుగుతుందట.. అయితే తాజాగా లాక్‌డౌన్‌ సమయంలో కూడా రాజమౌళి ఫ్యామిలీతో పాటు కీరవాణి కుటుంబం కలిసి ఫామ్‌ హౌస్‌కు వెళ్లారట. అక్కడే కొంతకాలం గడిపిన వాళ్లు ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చారని తెలిసింది. ఆ తర్వాత అందరికి జ్వరం రావడంతో టెస్ట్‌ చేయించుకోగా మైల్డ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టుగా న్యూస్ వైరల్ అవుతుంది. దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు.

ఇక అటు రాజమౌళి ప్రస్తుతం అర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుధిరం) అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

Krishna

Krishna

Next Story