Mahesh Babu react on SS Rajamouli : జక్కన్నకి మహేష్ భరోసా!

దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే... సామాన్యుల నుంచి సెలబ్రెటీల

Krishna
Published on: 31 July 2020 12:39 PM IST
Mahesh Babu react on SS Rajamouli : జక్కన్నకి మహేష్ భరోసా!
X
Rajamouli, Mahesh Babu (File Photo)

Mahesh Babu react on SS Rajamouli : దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే... సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరికి సోకుతూ ప్రజలను మరింతగా భయబ్రాంతులకు గురిచేస్తోంది కరోనా. అయితే ఇందులో ఎక్కువగా సినీ ఇండస్ట్రీకి చెందినవారు ఎక్కువగా ఉండడం ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే చాలా మంది సినిమా ఇండస్ట్రీకి చెందినవారు కరోనా బారిన పడ్డారు. తాజాగా టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి కూడా కరోనా బారిన పడ్డారు.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

రాజమౌళికి కరోనా సోకడంతో ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కిపడింది.. ఆయన కుటుంబం కరోనా నుంచి తొందరలోనే కోలుకోవాలని ఇండస్ట్రీ వర్గాలతో పాటుగా అభిమానులు కోరుకుంటున్నారు. అందులో భాగంగానే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. 'జాగ్రత్తలు తీసుకోండి సర్.. మీరు, మీ కుటుంబం త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను' అని మహేశ్ బాబు పేర్కొన్నారు. ఇక ఇప్పటివరకూ జూనియర్ ఎన్టీఆర్‌, రామ చరణ్‌ తేజ్‌, రవితేజ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన రాజమౌళి త్వరలో మహేశ్ బాబుతో కూడా సినిమా చేయనున్నారు.

ఇక అటు రాజమౌళి ప్రస్తుతం అర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుధిరం) అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

Krishna

Krishna

Next Story