బిగ్‌బాస్‌ లోకి మరో హాట్ బ్యూటీ!

బిగ్‌బాస్‌ లోకి మరో హాట్ బ్యూటీ!
x
Highlights

ప్రేక్షకుల్ని వంద రోజుల పాటు ఉర్రూతలూగించే రియాల్టీ షో బిగ్‌బాస్‌. తెలుగులో సీజన్ 3 గత ఆదివారం ప్రారంభమైంది. 15 మంది హౌస్ లో సందడి చేస్తున్నారు. ఇక...

ప్రేక్షకుల్ని వంద రోజుల పాటు ఉర్రూతలూగించే రియాల్టీ షో బిగ్‌బాస్‌. తెలుగులో సీజన్ 3 గత ఆదివారం ప్రారంభమైంది. 15 మంది హౌస్ లో సందడి చేస్తున్నారు. ఇక ప్రారంభమై మూడు రోజులు కాకుండానే మొదటి ఎలిమినేషన్ కి సభ్యులను కూడా నామినేట్ చేశారు. ఇక ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేదానిపై ప్రేక్షకుల అంచనాలు మొదలయ్యాయి.

ఇది ఇలా ఉండగా, బిగ్‌బాస్‌ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ చాలా ప్రాముఖ్యత పొందింది. మొదటి సీజన్ లో ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నవదీప్ మొత్తం షో గతినే మార్చేశాడు. హౌస్ లో ప్రత్యేక పాత్ర పోషించి ఫైనల్స్ వరకూ నిలబడిపోయాడు. అదే విధంగా గత సీజన్ లో పూజా రామచంద్రన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ, అంతగా ప్రభావం చూపించలేక పోయారు.

ఇక ఇప్పుడు సీజన్ 3 లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ హీరోయిన్ శ్రద్ధా దాస్ సీజన్ 3 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం, డిక్టేటర్, గరుడవేగా, హిప్పీ సినిమాల్లో హాట్ హాట్ గా ప్రేక్షకుల మనసులు దోచిన శ్రద్ధా దాస్ ఇప్పుడు బిగ్‌బాస్‌ లోకి ఎంట్రీ ఇస్తే షో కు మరింత గ్లామర్ తేస్తారండం లో సందేహం లేదు.

ఇప్పటికే బిగ్‌బాస్‌ లో శ్రీముఖి, అషు రెడ్డి, హిమజ తమ గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇప్పడు వీరికి శ్రద్ధ కూడా జత కలిస్తే ఇక రచ్చ రచ్చే.. కాదంటారా?

Show Full Article
Print Article
More On
Next Story
More Stories