దేవసేన కోసం హాలీవుడ్ నటుడు

దేవసేన కోసం హాలీవుడ్ నటుడు
x
Highlights

గతేడాది 'భాగమతి' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి ఇప్పుడు మళ్లీ ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

గతేడాది 'భాగమతి' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి ఇప్పుడు మళ్లీ ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. 'సైలెన్స్' అనే టైటిల్ తో హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం దర్శక నిర్మాతలు హాలీవుడ్ లో పాపులర్ అయిన మైకేల్ మాడ్సేన్ ను సంప్రదించారు. 'కిల్ బిల్', మరియు 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్' లాంటి చిత్రాలలో నటించిన మైకేల్ 'సైలెన్స్' సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం మైకేల్ కోసం ఈ సినిమా నిర్మాతలు భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది.

ఈ సినిమాలో నటించడానికి మైకేల్ కు మూడు కోట్ల పారితోషికం ఇవ్వనున్నారని సమాచారం. ఇంకా అధికారిక ప్రకటన వెలువడక పోయినా మైకేల్ కచ్చితంగా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపిస్తాడని ఇండస్ట్రీ వర్గాలు కోడైకూస్తున్నాయి. ఇక విలక్షణ నటుడు ఆర్ మాధవన్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కోన వెంకట్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తరఫునుండి టీ జీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ లో మార్చి నుండి మొదలవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories