Social Media Followers 2021: సోషల్ మీడియాలోనూ 'హీరో'లే

సోషల్ మీడియాలో తమ అభిమాన నటుడికి సంబందించిన వివరాలను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను తెలుసుకుంటున్నారు

Sandeep Reddy
Published on: 2 July 2021 11:53 AM IST
Highest Followers on Instagram, Facebook and Twitter in Tollywood Heroes 2021
X

టాలీవుడ్ హీరోస్ (ఫైల్ ఫోటో)

Social Media Followers 2021: కాలం మారింది ఒకప్పుడు తమ అభిమాన నటుడి సినిమా చూడాలంటే థియేటర్లకు క్యూలు కట్టిన జనం ఆ తర్వాత ఇంట్లో టివిలలో, ప్రస్తుతం తమ అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో తమకు నచ్చిన సమయంలో, నచ్చిన సినిమాలను చూడగలుగుతున్నారు. ఇక సోషల్ మీడియాలో తమ అభిమాన నటుడికి సంబందించిన వివరాలను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ అటు సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా తెలుసుకుంటున్న తెలుగు అభిమానుల అభిమాన హీరోల విషయానికి వెళ్తే అందులో రెబెల్ స్టార్ ప్రభాస్, ప్రిన్స్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , విజయ్ దేవరకొండ ముందు వరుసలో ఉన్నారు.

ఫేస్ బుక్ , ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా రాజకీయ,సినిమా మరియు వ్యాపారానికి సంభందించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలతో పంచుకుంటున్న దాంట్లో సినిమా రంగానికి ఉన్న ప్రాధాన్యత కంటే ఇతర రంగాలకు తక్కువ అనే చెప్పొచ్చు. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం ఫేస్ బుక్ లో అత్యధికంగా 23 మిలియన్ ఫాలోవర్స్ తో ప్రభాస్, ఇన్స్టాగ్రామ్ లో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ 12.3 మిలియన్ ఫాలోవర్స్, ట్విట్టర్ లో ప్రిన్స్ మహేష్ బాబు 11.5 మిలియన్ ఫాలోవర్స్ తో మొదటి స్థానంలో ఉండగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం అటు ఫేస్ బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ లో ఇద్దరి హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నాడు. ఫేస్ బుక్ లో 21.3 మిలియన్, ఇన్స్టాగ్రామ్ లో 12.2 మిలియన్ ఫాలోవర్స్ తో దూసుకుపోతున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన "పుష్ప" సినిమాతో త్వరలో బన్నీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరోపక్క ప్రభాస్ హీరోగా నటించిన "రాధేశ్యాం" చిత్రం కూడా షూటింగ్ ముగించుకొని డబ్బింగ్ పనుల్లో నిమగ్నమయ్యారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story