Aryan Khan: ముంబై డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ బెయిల్‌పై తీవ్ర ఉత్కంఠ

Aryan Khan: ఇప్పటికే నాలుగు సార్లు బెయిల్ తిరస్కరణ

Sandeep Eggoju
Published on: 26 Oct 2021 3:58 PM IST
High Court Hearing on Aryan Khan Bail Petition in Mumbai
X

ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై నెందు విచారన (ఫైల్ ఇమేజ్)

Aryan Khan: బాలీవుడ్ డ్రగ్స్ డర్టీ పిక్చర్‌ ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు బెయిల్ కోసం ఆర్యన్‌ఖాన్.. మరోవైపు ఆర్యన్‌కు బెయిల్ ఇవ్వొద్దని ఎన్సీబీ ఈ సీన్ ఇలా కంటిన్యూ అవుతున్న వేళ.. ఇవాల్టి విచారణలో ఆర్యన్‌ ఖాన్ కు బెయిల్ రాకుంటే మరో 14 రోజులు అతడు జైల్లోనే గడపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కోర్టుకు దీపావళి సెలవులు ఉండడంతో ఈ రోజు ఏం జరుగుతోంది అన్న ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో ఆర్యన్‌ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించేందుకు రంగంలోకి దిగడం మరింత ఉత్కంఠ రేపుతోంది.

మరోవైపు.. ఆర్యన్‌ బెయిల్‌ను ఎన్‌సీబీ వ్యతిరేకిస్తోంది. క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ప్రత్యక్ష సాక్షులను షారుక్‌ మేనేజర్‌ పూజా దద్లానీ ప్రభావితం చేస్తున్నట్లు కన్పిస్తోందని, ఇది పూర్తిగా దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు చేసే ప్రయత్నమే అని ఆరోపించింది. ఈ మేరకు బాంబే హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో కాసేపట్లో విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story