మళ్ళీ బిజీ అయిపోయిన త్రిష

మళ్ళీ బిజీ అయిపోయిన త్రిష
x
Highlights

ఒక సినిమా ఫ్లాప్ అయితే మరొక రెండు హిట్ సినిమాలను నమోదు చేసుకుంటుంది సీనియర్ బ్యూటీ త్రిష. హిట్ సినిమాలు లేక కెరీర్ డీలా పడుతోంది అనుకున్న సమయంలో '96', 'పేట' అనే సినిమాలతో వరుస హిట్లు అందుకున్న తర్వాత మళ్లీ టాప్ రేంజికి వెళ్ళిపోయింది త్రిష.

ఒక సినిమా ఫ్లాప్ అయితే మరొక రెండు హిట్ సినిమాలను నమోదు చేసుకుంటుంది సీనియర్ బ్యూటీ త్రిష. హిట్ సినిమాలు లేక కెరీర్ డీలా పడుతోంది అనుకున్న సమయంలో '96', 'పేట' అనే సినిమాలతో వరుస హిట్లు అందుకున్న తర్వాత మళ్లీ టాప్ రేంజికి వెళ్ళిపోయింది త్రిష. ప్రస్తుతం తమిళంలో ఈమె డేట్ల కోసం దర్శకులు ఎగబడుతున్నారు. ఒకప్పుడు సినిమా చేయాలా వద్దా అని ఆలోచించిన నిర్మాతలు సైతం ఇప్పుడు త్రిష ఇంటి ముందు క్యూలు కడుతున్నారు.

ఇక ఈ రెండు సినిమా హిట్ సినిమాల పుణ్యమా అని త్రిష కోలీవుడ్ లో మళ్లీ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పటికే ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి బోలెడు సినిమా ఆఫర్లు వస్తున్న తరుణంలో త్రిష ఈ సంవత్సరంలో ఐదు సినిమాలకు సైన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరికి గ్లామర్ విషయంలో కూడా ఏమాత్రం వెనకడుగు వేయని హీరోయిన్లలో ఒకరైన త్రిష ఇప్పుడు మళ్లీ బిజీ హీరోయిన్ గా మారిపోతుంది. ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి దశాబ్దం దాటుతున్నప్పటికీ త్రిష యువ హీరోయిన్ లకు సైతం కి గట్టి పోటి ఇవ్వడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories