Kiran Rathod: గ్లామర్ ఫోటోలతో మాజీ హీరోయిన్ దందా.. డబ్బులు ఇస్తే వీడియో కాల్ కూడా..

Kiran Rathod: గ్లామర్ ఫోటోలతో మాజీ హీరోయిన్ దందా.. డబ్బులు ఇస్తే వీడియో కాల్ కూడా..
x

Kiran Rathod: గ్లామర్ ఫోటోలతో మాజీ హీరోయిన్ దందా.. డబ్బులు ఇస్తే వీడియో కాల్ కూడా..

Highlights

Kiran Rathod: గ్లామర్ నే పెట్టుబడిగా పెట్టి హీరోయిన్లు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు సంపాదిస్తారనే విషయం మనందరికీ తెలిసిందే.

Kiran Rathod: గ్లామర్ నే పెట్టుబడిగా పెట్టి హీరోయిన్లు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు సంపాదిస్తారనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇదే అందాన్ని అడ్డం పెట్టుకొని సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించవచ్చని వెటరన్ హీరోయిన్ కిరణ్ రాథోడ్ నిరూపిస్తోంది. ఔను, సీనియర్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కు కజిన్ గా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయిన కిరణ్ రాథోడ్ తన గ్లామర్ తో కుర్రకారును ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

కిరణ్ రాథోడ్ 2002లో విక్రమ్ హీరోగా నటించిన జెమినీ సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్టవ్వడంతో అక్కడ పలు చిత్రాల్లో హీరోయిన్ గా అవకాశాలు సంపాదించింది. తెలుగులో సైతం పలు చిత్రాల్లో నటించింది. నువ్వు లేక నేను లేను, శ్రీరామ్, నాని, అందరు దొంగలే దొరికితే, చెప్పవే చిరుగాలి, భాగ్యలక్ష్మీ బంపర్ డ్రా, హైస్కూల్, కెవ్వుకేక వంటి చిత్రాల్లో నటించి చెప్పుకోదగ్గ స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. తమిళం, తెలుగు చిత్రాలతో పాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా నటించి పాపులారిటీ దక్కించుకుంది.

గ్లామర్ ఫీల్డ్ లో 15 ఏళ్ల పాటు రాణించిన కిరణ్ రాథోడ్ ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉంటుంది. అయితే అవకాశాలు లేకపోవడంతో సైలెంట్ గా ఉండకుండా తన ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేస్తూ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో బాగానే సందడి చేస్తోంది. తన గ్లామర్ ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేస్తూ యూత్ ని అట్రాక్ట్ చేస్తున్న ఈ 40 ప్లస్ బ్యూటీ తాజాగా మరో అడుగు ముందుకేసి కిరణ్ పేరుతో ఒక యాప్ ని ప్రారంభించింది. ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలంటే 49 రూపాయలను చెల్లించాలి. అంతేకాదు ఈ యాప్ లో వెయ్యి రూపాయలు కడితే కిరణ్ రాథోడ్ తన రెండు గ్లామరస్ ఫోటోలను పంపిస్తోంది. అలాగే యూజర్లకు ఆడియో కాల్, వీడియో కాల్ చేసేందుకు కూడా అవకాశం కల్పిస్తోంది.

కిరణ్ రాథోడ్ తో 5 నిమిషాలు కాల్ మాట్లాడాలంటే 10 వేల రూపాయలు చెల్లించాలి. ఆమెను చూస్తూ లైవ్ లో మాట్లాడే అవకాశం కూడా ఉంది. 15 నిమిషాలకు 14 వేలు, 25 నిమిషాలకు 25 వేల రూపాయలను కిరణ్ రాథోడ్ ఛార్జ్ చేస్తోంది.కిరణ్ రాథోడ్ తో మాట్లాడాలి అంటే వేలు ఖర్చు చేయాలి. మరి, వేల రూపాయలు ఖర్చు చేసినవారితో కిరణ్ రాథోడ్ ఏం మాట్లాడుతుందో తెలియడం లేదు..అయితే ఫ్యాన్స్ నుంచి డబ్బులు వసూలు చేయడం ఏంటని చాలా మంది విమర్శిస్తున్నా ఈ మిడిల్ ఏజ్ బ్యూటీ మాత్రం చెవికెక్కించుకోవడం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories