Keerthy Suresh New Movie : మరో విభిన్నమైన పాత్రలో కీర్తి సురేష్ !

keerthy suresh New Movie : రామ్ హీరోగా వచ్చిన నేను శైలజ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయింది మలయాళ నటి కీర్తి సురేష్..మొదటి

Krishna
Published on: 16 Aug 2020 4:26 PM IST
Keerthy Suresh New Movie : మరో విభిన్నమైన పాత్రలో కీర్తి సురేష్ !
X
keerthy suresh (File Photo)

keerthy suresh New Movie : రామ్ హీరోగా వచ్చిన నేను శైలజ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయింది మలయాళ నటి కీర్తి సురేష్..మొదటి సినిమాతోనే అటు అందం ఇటు అభినయంతో ఆకట్టుకుంది ఈ భామ.. ఆ తర్వాత నాని హీరోగా నటించిన నేను లోకల్ సినిమాలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఆ తరవాత చేసిన మహానటి సినిమా కీర్తి కెరియర్ ని పూర్తిగా మార్చేసింది. ఏకంగా ఈ సినిమాకి జాతీయ అవార్డుని గెలిచుకుంది. అప్పటివరకు గ్లామర్ పాత్రలు చేసుకుంటూ వచ్చిన కీర్తికి ఫస్ట్ టైం నటనకి తగ్గ పాత్ర దక్కింది.

జాతీయ అవార్డు గెలుచుకున్న కీర్తి ఆ తర్వాత కథకి, పాత్రకి ప్రాధాన్యత ఉన్న పాత్రలనే చేస్తోంది. అందులో భాగంగానే వరుస సినిమాలను ఎంచుకుంటుంది. తాజాగా తాను చేయబోతున్న కొత్త సినిమాని అనౌన్సు చేసింది.. 'సాని కాయితం(పేడ పేపర్)' అనే పేరుతో ఓ సినిమాని చేస్తోంది. దీనికి సంబంధించిన మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం.. ఈ పోస్టర్ లో కీర్తి సురేష్ వీపు వెనుక క‌త్తి పెట్టుకుని నిల‌బ‌డగా, ఆమె ప‌క్కనే మ‌రో వ్యక్తి చేతిలో క‌త్తిలో నిల‌బ‌డి ఉన్నాడు. వీరికి కొద్ది దూరంలో కారు ఆగి ఉండడం, అలాగే కొంత మంది ఆయుధాల‌తో కొంత మంది వ్యక్తలు నిలుచుని ఉండడంతో సినిమా పైన మంచి ఆసక్తికరంగా నెలకొంది. అరుణ్ మాదేశ్వర‌న్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇక ఈ సినిమాతో పాటుగా లేడి ఓరియెంటెడ్ మూవీగా గుడ్ ల‌ఖ్ స‌ఖి అనే చిత్రాన్ని చేస్తోంది కీర్తి సురేష్.. నిన్న (ఆగస్టు 15) న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. నిమిషం రెండు సెకండ్స్ ఉన్న ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో కీర్తి సురేష్ నటనతో మరోసారి ఫిదా చేసేలాగా ఉంది.. క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ షూటర్‌గా నటిస్తుంది.

Krishna

Krishna

Next Story