ఆ ఒక్కటీ అడక్కండి! అనుపమా పరమేశ్వరన్

ఆ ఒక్కటీ అడక్కండి! అనుపమా పరమేశ్వరన్
x
Highlights

క్రికెటర్ కే ఎల్ రాహుల్ తో డేటింగ్ లో ఉన్నట్టు వస్తున్న వార్తలపై అనుపమా పరమేశ్వరన్ ఆ ఒక్కటీ అడగోద్దంటూ స్పందించారు. ఈ విషయంలో చెప్పడానికి ఏమీ లేదు, నో...

క్రికెటర్ కే ఎల్ రాహుల్ తో డేటింగ్ లో ఉన్నట్టు వస్తున్న వార్తలపై అనుపమా పరమేశ్వరన్ ఆ ఒక్కటీ అడగోద్దంటూ స్పందించారు. ఈ విషయంలో చెప్పడానికి ఏమీ లేదు, నో కామెంట్స్ అంటూ చెప్పారు. ఆమె నటించిన తాజా చిత్రం రాక్షసుడు త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరులతో ఆమె మాట్లాడారు.

తనకు మొదట రంగస్థలం లో అవకాశం వచ్చిందనీ, ఖాళీ లేని కారణంగా ఆ సినిమా చేయలేదని చెప్పారు. అందుకు చాలా బాధపడుతున్నట్టు తెలిపారు. అయితే, సమంత ఆ సినిమాలో చాలా బాగా చేశిందంటూ కితాబిచ్చింది అనుపమ. ఇక రాక్షసుడు సినిమా గురించి మాట్లాడుతూ, సినిమాలో తన పాత్ర చాలా సింపుల్ గా ఉంటుందని అన్నారు. ఎప్పుడూ చేయని టీచర్ పాత్ర చేశాననీ, సినిమా మొత్తం చీర కట్టులోనే ఉంటాననీ చెప్పారు.

''రాక్షసన్‌ నాకు రెండో రీమేక్‌. 'ప్రేమమ్‌' రీమేక్‌లో నా పాత్రలో నేనే నటించా. 'నిన్నుకోరి' తమిళ రీమేక్‌లో నటిస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఎక్కువగా రీమేక్‌లే చేస్తున్నాను. అలా కుదిరిపోతున్నాయ్‌. అయితే 'రాక్షసుడు' సినిమాలో పెద్దగా మార్పులు చేయలేదు. తెలుగు నేటివిటీకి తగినట్లు మాత్రమే తీర్చిదిద్దాం. సినిమా స్టోరీని డిస్టర్బ్‌ చేయలేదు.'' అంటూ చెప్పుకోచ్చిందీ భామ

Show Full Article
Print Article
More On
Next Story
More Stories