Hero Vishal: హీరో విశాల్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. దూసుకొచ్చిన ట్రక్కు..

Hero Vishal: తమిళ్ లో స్టార్ హీరో గా పేరు తెచ్చుకున్న యాక్షన్ హీరో విశాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.

Arun Chilukuri
Published on: 23 Feb 2023 10:09 AM IST
Hero Vishal Escape From a Mishap
X

Hero Vishal: హీరో విశాల్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. దూసుకొచ్చిన ట్రక్కు..

Hero Vishal: తమిళ్ లో స్టార్ హీరో గా పేరు తెచ్చుకున్న యాక్షన్ హీరో విశాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. అయితే గ‌త కొంత కాలంగా ఒక్క బ్లాక్ బ‌స్టర్ తో మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ కావాల‌ని విశాల్ విశ్వ ప్రయ‌త్నాలు చేస్తున్నాడు. ఈమధ్యనే విడుదల అయిన లాఠీ సినిమా లో సిన్సియ‌ర్ పోలీస్ కానిస్టేబుల్ గా కనిపించిన విశాల్ ఈ సినిమాతో మంచి హిట్ ద‌క్కించుకోవాల‌నుకున్నాడు. కానీ "లాఠీ" సినిమా అంతగా ప్రేక్షకులను అలరించ లేకపోయింది. అటు త‌మిళ‌ ప్రేక్షకులు మాత్రమే కాక తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా ను పెద్దగా రిసీవ్ చేసుకోలేదు.

ఇక విశాల్ ఇప్పుడు తన ఆశలన్నీ తన తదుపరి సినిమా "మార్క్ ఆంటోనీ" మీదే పెట్టుకున్నాడు. అధిక్ ర‌విచంద్రన్ ఈ సినిమా కి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. ఎస్‌.జె. సూర్య‌, సునీల్ కీల‌క పాత్రల్లో కనిపిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో శ‌ర‌వేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈమధ్యనే సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ లో విశాల్ పెద్ద గ‌డ్డం, గుబురు మీసంతో ఖాకీ రంగు డ్రెస్ లో గ‌న్ ప‌ట్టుకుని అరుస్తూ క‌నిపించాడు. విశాల్ లుక్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కానీ తాజాగా చిత్ర షూటింగ్ లోకేష‌న్ లో ప్రమాదం జ‌రగ‌డంతో విశాల్ అభిమానులు కంగారు పడ్డారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైర‌ల్ గా మారింది. వివరాల్లోకి వెళితే, షూటింగ్ లో భాగంగా ఓ బండి గోడ‌ల్ని బ‌ద్దలు కొట్టుకుని రావ‌డంతో అక్కడున్న వారంతా చెల్లచెదురు అవుతారు. కానీ అదుపు త‌ప్పిన వ్యాన్ అక్కడున్న వారి మీదకి దూసుకు వచ్చింది. ఇది ప‌సిగ‌ట్టి అక్కడి వారు త‌ప్పించుకున్నారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జ‌రగ‌లేదు. అటు విశాల్‌ కూడా ఈ వీడియో షేర్‌ చేస్తూ.. 'కొద్ది క్షణాలు.. కొన్ని అంగుళాల దూరంలో నా చావు కనిపించింది. థ్యాంక్‌ గాడ్‌.. ఈ ప్రమాదం తర్వాత తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నాం' అని ట్వీట్‌ చేశాడు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story