విజయ్ అరుదైన రికార్డుకి కరోనా బ్రేక్!

Vijay Master Movie : కరోనా కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో ధియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే.. దీనితో స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాలు వరకు అన్ని వాయిదా పడ్డాయి..

Krishna
Published on: 8 Oct 2020 12:33 PM IST
విజయ్ అరుదైన రికార్డుకి కరోనా బ్రేక్!
X

Vijay 

Vijay Master Movie : కరోనా కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో ధియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే.. దీనితో స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాలు వరకు అన్ని వాయిదా పడ్డాయి.. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ధియేటర్లకి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.. కేంద్రం కొత్త మార్గదర్శకాలతో అక్టోబర్ 15 నుంచి ధియేటర్లు రీఓపెన్ కానున్నాయి.. ధియేటర్లు రీఓపెన్ అయినప్పటికీ కరోనాను దృష్టిలో పెట్టుకొని సినిమాని చూసేందుకు ప్రేక్షకులు ఎవరైనా ముందుకు వస్తారా అన్నది ఇప్పుడు అసలు సమస్యగా మారింది. దీంతో సినిమాలను ధియేటర్లలలో విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు, హీరోలు వెనుకాడుతున్నారు.

అందులో భాగంగానే తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం "మాస్టర్" సినిమా అన్ని కార్యక్రమాలనూ సిద్దం చేసుకొని విడుదలకి సిద్దం అయింది. అయితే కరోనా వలన సినిమా విడుదల ఉంటుందా లేదా అని అభిమానులలో సందేహం నెలకొంది. సినిమాని క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తారని తమిళ ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే ప్రేక్షకులకు చిత్ర నిర్మాతలు షాక్ ఇచ్చారు. సినిమాని ఈ ఏడాది రిలీజ్ చేయడం లేదని వెల్లడించారు. దీనితో విజయ్ పేరు పైన ఉన్న ఓ అరుదైన రికార్డుకి బ్రేక్ పడినట్టు అయింది.

సినిమాల్లోకి విజయ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సంవత్సరానికి ఒక్క సినిమా అయిన విడుదల చేస్తూ వచ్చారు. ఇన్నేళ్ల సినీ కెరీర్లో ఒక్క ఏడాది కూడా ఆయన జీరో ఇయర్‌గా విడిచిపెట్టలేదు. తాజాగా కరోనా పుణ్యామా అని అ అరుదైన రికార్డుకి బ్రేక్ పడినట్టు అయింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సరసన మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించింది.. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించాడు. సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

Krishna

Krishna

Next Story